'ఇస్మార్ట్ శంకర్' కు స్ఫూర్తి ఆ చిత్రమేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా మన టాలీవుడ్ దర్శకుల్లో చాలా మంది ఇతర భాషా చిత్రాల నుండి ప్రేరణ పొంది కథలను తయారు చేసుకుంటారు. అలాంటి ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితోనే `ఇస్మార్ట్ శంకర్` సినిమాను కథను తయారు చేసుకున్నాడట. 2016లో హాలీవుడ్లో క్రిమినల్ అనే సినిమా వచ్చింది. ఇందులో ఓ సిఐఎ ఏజెంట్ హ్యాకర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఏజెంట్ చనిపోయే సందర్భం వస్తుంది.
అప్పుడు తన మెమొరీనంతా ఓ క్రిమినల్‌కు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పటి నుండి క్రిమినల్ ఏజెంట్ బ్రెయిన్‌తో హ్యాకర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే కథ. దీన్నే పూరి మన నెటివిటీకి తగ్గట్టు మార్చి తీస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నేటి నుండి వారణాసిలో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరగనుంది. ఈ వేసవిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com