ప‌వ‌న్‌తో ఇల్లీ బేబీ! ఓకే అయిన‌ట్లేనా?

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ హీరోయిన్‌ను తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావించింది. ముఖ్యంగా శృతిహాస‌న్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ తాను పవన్తో నటించడం లేదనే విషయాన్నిశృతి తేల్చేసింది. దీంతో మేక‌ర్స్ జ‌గ‌న‌సుంద‌రి ఇలియానాను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. గ‌తంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఇలియానా జ‌ల్సా సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ‘వ‌కీల్‌సాబ్’ సినిమా విడుద‌ల విష‌యానికి వ‌స్తే.. సినిమాను ముందుగా మే 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావం సినిమాపై బాగానే పడుతుంది. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత పెండింగ్ సినిమాను పూర్తి చేసి త‌ర్వాత సినిమా విడుద‌ల గురించి ఆలోచిస్తార‌ట‌. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మేర‌కు వ‌కీల్ సాబ్ ఆగ‌స్ట్ లేదా ద‌స‌రాకు సంద‌డి చేసే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

More News

క‌రోనా వైర‌స్‌పై మ‌రో సినిమా ..

ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు సినిమాల‌ను నిర్మించ‌డం మ‌న మేక‌ర్స్‌కు అల‌వాటు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని పార‌దోల‌డానికి అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు.

జర్నలిస్టుల తొలగింపుపై ముంబై ప్రెస్ క్లబ్ తీవ్ర ఆగ్రహం

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించొద్దని.. వారి జీతాల్లో కోత తగదని సాక్షాత్తు ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారు. అయితే కొన్ని మీడియా సంస్థల

జగన్‌ను నేను ఆ మాట అన్లేదు.. బెదిరిస్తున్నారు : రాయపాటి

‘కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని.. కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు’ అని ఏపీ సీఎంపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు.. వాట్ నెక్స్ట్!?

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. ఇండియాలో అంత లేదు కానీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం

కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే...

లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లకూడదని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. మందుల కోసమో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లవలసిన పరిస్థితి.