మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కుర్రాడేనా!?

  • IndiaGlitz, [Saturday,October 26 2019]

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరికీ ఊహించిన దానికంటే ఎక్కువగానే సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా గతంతో పోలిస్తే శివసేనకు ఎక్కువగానే సీట్లు దక్కాయి. దీంతో ఈసారి తమకే సీఎం ఇవ్వాలని శివసేన.. బీజేపీని పట్టుబట్టింది. అంతేకాదు.. మంత్రి పదవుల్లో కూడా 50-50 లెక్కన పంచుకోవాల్సిందేనని తేల్చిచెప్పేసింది. ఈ విషయాన్ని ఇంతకు మునుపే అనగా.. ఎన్నికల ముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమ ఇంటికి వచ్చినపుడు ఇదే విషయంపై చర్చించామన్న విషయాన్ని ఈ సందర్భంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ శివసేనకు సీఎం ఆఫర్ వస్తే మాత్రం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను పీఠంపై కూర్చొబెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

29 ఏళ్ల కుర్రాడే సీఎం అవుతాడా!?

ఈ క్రమంలో.. ‘భావి సీఎం ఆదిత్య ఠాక్రే’ అంటూ ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా పోస్టర్లు ప్రత్యక్షమవ్వడం గమనార్హం. కాగా.. 29ఏళ్ల ఆదిత్య పోటీచేసిన ‘వర్లీ’ లో ప్రత్యర్థి అయిన ఎన్సీపీ అభ్యర్థిని ఓడించి 67వేల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈయనే గనుక సీఎం అయితే దేశంలో అత్యంత కుర్ర సీఎం.. అవుతారేమో. ఇది హిస్టరీలో నిలిచిపోవడం పక్కానే.! మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. అయితే అభిమానులు మాత్రం ఆదిత్యనే సీఎం కావాలని కోరుకుంటున్నారు.

50:50 అయ్యే పనేనా!?

అయితే.. ఫైనల్‌గా సీఎం పదవిని చెరో సగం రోజులు (50:50) పంచుకోవాలని ఉద్దవ్ బీజేపీని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే ఓకే లేకుంటే ఏ మాత్రం తేడా కొట్టినా పరిస్థితులు మరోలా ఉంటాయేమో. కాగా.. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా.. బీజేపీ, శివసేన కూటమి 161 స్థానాల్లో.. కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి 98 చోట్ల గెలిచింది. ఎంఐఎం 2 చోట్ల, ఇతరులు 27చోట్ల విజయం సాధించారు. బీజేపీక.. 105 , శివసేన 56 స్థానాలు వచ్చాయి. అయితే సీఎం పీఠం ఎవరు కూర్చుంటారో..? పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో..? బీజేపీ-శివసేన చివరికి కొట్టుకుని విడిపోతాయా..? కలిసే ఉండి.. సీఎం పీఠాన్ని పంచుకుని సాఫీగా సాగిపోతాయో అన్నది వేచిచూడాల్సిందే మరి.

More News

వల్లభనేని వంశీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి!?

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇస్తున్న ట్విస్ట్‌లకు అసలేం జరుగుతోందో తెలియక అటు తెలుగు తమ్ముళ్లు.. ఇటు కార్యకర్తలు, అభిమానులు కంగుతింటున్నారు.

చంద్రబాబుకు 'డబుల్' షాక్.. త్వరలో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్!

టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ కానున్నారా..? టీడీపీ అధినేత చంద్రబాబుకు డబుల్ షాక్ తగలనుందా..? ఇప్పటికే వరుస షాక్‌లతో సతమతం అవుతున్న ఇదో భారీ షాక్ కానుందా..?

పవన్‌యిజం అంటే ఇదే.. లాలూచీ పనులు మానెయ్!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పేచీ పెట్టుకోవడం, చంద్రబాబుతో లాలూచీ పడటమే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పవన్‌ యిజమని మంత్రి పేర్ని నాని సెటైర్ల వర్షం కురిపించారు.

పవన్ చుట్టూ ఐదుగురు ఐటెం గర్ల్స్.. పోస్టర్ రిలీజ్!

ఇదేంటి పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కదా.. మరి ఆయనకేంటి సంబంధమని ఆశ్చర్యపోతున్నారా..? అబ్బే అదేంలేదండోయ్.. ఈయన రియల్ పవన్ కాదు.. రీల్ పవన్ మాత్రమే.

‘సుజనా చౌదరి పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ నేత’!

టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత సుజనా స్పీడ్ పెంచి