బాలయ్య 101వ చిత్రం ఆ దర్శకుడితోనా..?

  • IndiaGlitz, [Tuesday,December 27 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఆత‌ర్వాత బాల‌య్య 101వ చిత్రంగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కత్వంలో రైతు అనే సినిమా చేయ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే. కృష్ణ‌వంశీ ప్ర‌స్తుతం న‌క్ష‌త్రం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.
అందుచేత బాల‌య్య కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో ప్రారంభించాలి అనుకుంటున్నార‌ట‌. ఈలోపు బాల‌య్య 101వ చిత్రాన్ని గ‌తంలో టాప్ హీరో సినిమాని తెర‌కెక్కించిన కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.అంతే కాకుండా... బాల‌య్య‌, కృష్ణారెడ్డి కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నారు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి...ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

చిరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకర్ ఎవరో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 4న భారీ స్ధాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పేద మహిళకు సాయం చేసి చేయూత అందించిన సంపూర్ణేష్ బాబు

హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు...

సూర్యతో లారెన్స్ పోటీ....

కన్నడంలో సూపర్ హిట్ అయిన శివలింగ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై రాఘవేంద్ర లారెన్స్,

బాధ అపుకోలేక ఏడ్చేసిన సప్తగిరి..!

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి..హీరోగా మారిన యువ నటుడు సప్తగిరి.

అసలైన వంగవీటిని చూపిస్తా..అందరి పేర్లు బయటపెడతా..దమ్ముంటే ఆపండి..! - జీవి

వంగవీటి వివాదం ముదురుతోంది.వర్మ కేవలం డబ్బు కోసమే వంగవీటి రంగాను విలన్ గా చూపించాడని,మమ్మల్ని అడిగి ఉంటే...