‘జార్జిరెడ్డి’ మూవీ యూనిట్ డ్రామాలాడుతోందా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జార్జ్‌రెడ్డి’. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నవంబర్ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో ఎప్పుడూ.. ఎక్కడా లేని వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. అయితే ఈ వివాదాలు యాదృచ్చికంగా జరుగుతున్నాయా..? లేకుంటే చిత్ర యూనిటే సృష్టిస్తోందా..? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఎన్నెన్నో వివాదాలను కావాల్సిందే సృష్టిస్తుందన్న విషయం కొన్ని సినిమాల విషయంలో అక్షరాలా నిజమైంది. అయితే తాజాగా ‘జార్జ్‌రెడ్డి’ చిత్ర యూనిట్ కూడా పక్కా ప్లానింగ్‌తో ఫ్రీ ప్రమోషన్స్ కాన్సెప్ట్‌లాగా ఉందని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతున్నాయ్ అనేది డ్రామాలాడిస్తువారికి.. డ్రామాలాడుతున్నవారికి మాత్రమే ఎరుక..!
పవన్ వస్తున్నాడని పుకార్లు.. చివరికిలా!
వాస్తవానికి ఈ నెల 17న జరగాల్సిన ‘జార్జ్‌రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రచారం గట్టిగానే చేశారు. అయితే అసలు ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం కానీ.. మరోవైపు జనసేనాని కానీ ఆయన పార్టీకి చెందిన ముఖ్యనేతగానీ ఒక్కరంటే ఒక్కరూ కూడా స్పందించలేదు. అంతేకాదు పవన్ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో చిత్ర యూనిట్‌కు ఒకింత షాక్ తగిలినట్లైంది. అయితే పవన్‌ను నిజంగానే సంప్రదించారా..? లేకుంటే మోగాభిమానుల ఆదరణ కోసం చిత్ర యూనిట్ ప్రీ ప్రమోషన్స్ ఇలా చేస్తోందా..? అన్నది తెలియరాలేదు.
రంగంలోకి దిగిన ఏబీవీపీ..!
మొన్నటి వరకూ ఒకటి అనుకుంటే ఇప్పుడు రిలీజ్ మున్ముంథు మరో కలలో కూడా ఊహించని షాక్ తగిలింది. సినిమాలో ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని.. సినిమాలో మా సంఘాన్ని కించపరిస్తే సినిమా రిలీజ్ కానివ్వమని అఖిల భారత విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఏబీవీపీ సెక్రటరీ మీడియా ముందుకొచ్చి.. చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశారు. జార్జిరెడ్డి సుమారు 15కు పైగా క్రిమినల్ కేసులున్నాయని ఏబీవీపీ ఆరోపిస్తోంది. లేనివి ఉన్నట్లు చూపిస్తే మాత్రం సినిమాను కచ్చితంగా అడ్డుకుంటామని నేతలు హెచ్చరిస్తున్నారు. జార్జ్‌రెడ్డి హత్య కేసులో ఏబీవీపీ హస్తం లేదని గతంలో పలుమార్లు గతంలోనే కోర్టు తీర్పునిచ్చిందని ఏబీవీపీ నేతలు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కర్నీ టార్గెట్ చేయలేదని డైరెక్టర్ జీవన్ రెడ్డి చెబుతున్నారు.
ఇప్పుడే ఎందుకింత హంగామా..!?
మరి పై రెండు వ్యవహారాల్లో ఏది నిజమో..? ఏది అబద్ధమో చిత్ర యూనిట్‌కే తెలియాలి. అయితే సినిమా పేరు పెట్టినప్పట్నుంచి షూటింగ్.. పూర్తయిన వరకూ సైలెంట్‌గా విద్యార్థి సంఘాలు ఇప్పుడు రావడమేంటి..? అంటే ఇందులో నిజానిజాలెంతున్నాయో. అయితే ఈవెంట్‌కు పవన్ వసత్తున్నారని పక్కా ప్లానింగ్‌తో ఓ స్టంట్ ఇచ్చారు. అయితే అది కాస్త తారుమార్వడంతో.. తాజాగా ఏకంగా ఏబీవీపీనే రంగంలోకి దింపిందని బయట నెటిజన్లు, సినీ ప్రియులు విమర్శలు వాపోతున్నారు. ఇన్ని రోజులుగా లేని ఈ వివాదాలన్నీ ఇప్పుడే ఎందుకు మొదలయ్యాయ్.. అంటే ప్రీ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ హడావుడి జరుగుతోందా..? లేదా నిజంగా ఈ వివాదాలు ‘జార్జిరెడ్డి’ని వెంటాడుతున్నాయా..? అనేది మాత్రం చిత్ర యూనిట్‌కే తెలియాలి మరి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘జార్జ్‌రెడ్డి’ మూవీ పేరు మాత్రం గట్టిగానే మార్మోగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments