ఈ వారం గంగవ్వ ఎలిమినేట్ అవుతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4.. మొదట్లో అంతగా ఆకట్టుకోకపోయినా.. క్రమక్రమంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఎవరికి వారే మంచి టాలెంటెడ్ అని పలు టాస్క్‌ల ద్వారా నిరూపించుకుంటూ వస్తున్నారు. మరోవైపు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. వెరసి షోకి కావల్సినంత రెస్పాన్స్ క్రమక్రమంగా వచ్చేసింది. దీంతో షో రేటింగ్ కూడా దూసుకుపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు హౌస్‌లో ఉన్నప్పుడు కూడా రాని రేటింగ్‌ని ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్లు తీసుకు వస్తున్నారనడంలో సందేహం లేదు.
అయితే తొలివారం నామినేషన్‌లో భాగంగా.. గంగవ్వకు ఊహించనన్ని ఓట్లు వచ్చాయి. ఇక షో విన్నర్ గంగవ్వే అన్నంతగా ఆమె హవా నడిచింది. అంతా బాగుందనుకున్న సమయంలో సడెన్‌గా ఆమె అనారోగ్యం పాలయ్యారు. తినే ఆహారంతో పాటు.. ఉండే వాతావరణంలో కూడా సడెన్‌గా మార్పు రావడంతో ఆమె ఇమడలేకపోతున్నారు. పల్లెటూరులో నా అన్న వాళ్లందరి మధ్య సరదాగా గడిపిన.. గంగవ్వను తీసుకొచ్చి తెలియని వ్యక్తుల మధ్య అది కూడా నాలుగు గోడల మధ్య బంధించడంతో ఆమె చాలా కృంగిపోతున్నారు. దీంతోనే ఆమె అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది.
గంగవ్వ ఎలిమినేట్ అవుతారా?
ఈ పరిస్థితులన్నింటినీ చూస్తుంటే ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదేమో అనిపిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 1లో సంపూర్ణేష్ బాబు ఫేస్ చేసిన పరిస్థితులనే ప్రస్తుతం గంగవ్వ కూడా ఫేస్ చేస్తున్నారు. 4-5 వారాలుండి షో నుంచి వెళ్లిపోతానని ఆమె ఇటీవల కెమెరాకు కూడా క్లియర్‌గా చెప్పారు. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున వద్ద కూడా చెప్పారు. అయితే మిమ్మల్ని పంపిచాల్సింది బిగ్‌బాస్ కాదని.. ప్రేక్షకులని నాగ్ చెప్పారు. అయితే నిన్న ఆరోగ్యం బాగోలేకపోవడంతో గంగవ్వను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూంకి పిలిపించి అడిగితే కూడా తాను హౌస్‌లో ఉండలేనని స్పష్టం చేసింది. ఇక మీదట కూడా గంగవ్వ హౌస్‌లో ఉండే పరిస్థితులైతే కనిపించట్లేదు. అయితే ఈ వారం.. లేదంటే మరో రెండు వారాలకు మించి గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండకపోవచ్చని పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com