బాల‌య్య టైటిల్‌ అభిమానులకు న‌చ్చుతుందా?

  • IndiaGlitz, [Saturday,May 30 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌న్‌ను కూడా తీసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను టైటిల్‌తో స‌హా అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడ‌ట‌. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో భూమిక లేడీ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇందులో కొత్త హీరోయిన్ న‌టిస్తుంది.