దిల్‌రాజు హ్యాపీగా లేడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు స్టార్ హీరోలందరినీ డైరెక్టర్ చేసి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు వి.వి.వినాయక్. ఈయన ఇప్పుడు `శీనయ్య` అనే చిత్రంతో దర్శకుడి నుండి హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కాంటెపరరీ ఇష్యూను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రం ఔట్‌పుట్‌పై నిర్మాత దిల్‌రాజు హ్యాపీగా లేడట. దీంతో రీషూట్ చేయమని డైరెక్టర్‌ని ఆదేశించాడని వార్తలు వినపడుతున్నాయి.
సమాచారం ప్రకారం..కాంటెంపరరీ సబ్జెక్ట్‌తోనే సినిమా ఉంటుందట. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అత్యాచారాలనే కథాంశంగా తీసుకున్నారట. దిశ, ఉన్నావ్ హత్యాచార ఘటనలు దేశమంతా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. నిందితుల హతం పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రాల అధినేతలే హైదరాబాద్ పోలీసులపై అభినందనలు కురిపించారు. ఇక సినీ ఇండస్ట్రీ అయితే పోలీసులను హీరోలుగా పోలుస్తూ ట్వీట్స్ చేసింది. దిశ హత్యలో నిందితుల ఎన్‌కౌంటర్‌తో ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి ప్రతీకార కథాంశంతోనే శీనయ్య కూడా రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఓ ఘటనతో తీవ్ర వ్యథకు లోనైన శీనయ్య.. ఆ ఘటనకు పాల్పడిన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేదే ఈ చిత్ర కథ అంటున్నారు. అయితే ఈ కథకు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి సినిమా రూపొందిస్తున్నారట. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments