పవన్ కోసమే సాయిధరమ్ తేజతో సినిమాలా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రేయ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆతర్వాత ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని సాధించింది. అసలు...పిల్లా నువ్వులేని జీవితం చిత్రాన్ని నాగచైతన్యతో చేయాలనుకున్నారు. అయితే దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమాని సాయిధరమ్ తేజతోనే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అలాగే సాయిధరమ్ తేజతో సినిమా తీసారు.
మళ్లీ సాయిధరమ్ తేజతో దిల్ రాజు మరో సినిమా చేయాలనుకున్నారు. ఈసారి డైరెక్టర్ హరీష్ శంకర్. అదే సుబ్రమణ్యం ఫర్ సేల్. చిరు పుట్టినరోజు సందర్భంగా సుబ్రమణ్యం ఫర్ సేల్ టీజర్, ఆడియో రిలీజ్ చేసారు. ఆడియోకు మంచి స్పందలన లభిస్తోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ రిలీజ్ చేసారు. ఈ నెలలోనే సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం రిలీజ్ కాకముందే దిల్ రాజు సాయిధరమ్ తేజతో ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేసాడు. ఈసారి డైరెక్టర్ పటాస్ ఫేం అనిల్ రావిపూడి. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. అంతా బాగానే ఉంది. సాయిధరమ్ తేజతో దిల్ రాజు వరుసగా మూడు సినిమాలు చేయడానికి కారణం ఏమిటి...? సాయిధరమ్ తేజ్ ను ఇక వదలవా...? అంటూ దిల్ రాజును తేజ్ తల్లి నిలదీసారట. ఈ విషయాన్ని దిల్ రాజే స్వయంగా సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. అయితే దిల్ రాజు తేజ్ తో వరుసగా మూడు సినిమాలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. అదేమిటంటే తేజ్ వెనకుండి నడిపిస్తుంది అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు తేజ్ తో సినిమాలు తీసి సక్సెస్ అందిస్తే...ఎప్పటి నుంచో పవన్ తో సినిమా తీయాలన్న తన కోరిక నెరవేరుతుందని ప్లాన్ వేసాడు. దిల్ రాజు...ప్లాన్ వర్కవుట్ అయ్యింది. పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది పవన్ కి తగ్గ కథ, డైరక్టరే సెట్ కావాలి. సెట్ అయితే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ. దిల్ రాజు మూమూలోడు కాదు...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com