ఏపీకి కరోనా పాకిందా.. ఆ 17 మంది సంగతేంటి!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌కూ కరోనా వైరస్ పాకిందా..? హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఏపీకి చెందిన వారు కూడా ప్రయాణించారా..? ఆయనతో కలిసి జర్నీ చేసిన వారి సంగతేంటి..? ఆ 17 మందికి కూడా కరోనా సోకిందా..? అసలేం జరుగుతోంది..? అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో బీతిల్లిపోతున్నారు. ఇంతకీ అసలు విషయమేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
భయం.. భయం!?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా హైదరాబాద్‌కూ వచ్చేసింది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎప్పుడేం జరుగుతుందో అని తెలుగు రాష్ట్రాల జనాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు.
ఆ 17 మంది ఎవరు!?
కాగా.. బెంగుళూరు నుంచి వచ్చిన ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే అప్పటి నుంచి 80 మందితో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయనతో పాటు 17 మంది ఏపీకి చెందిన వ్యక్తులు కూడా కలిసి ప్రయాణించారని ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ 17 మంది విషయాన్ని స్వయంగా ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నానీనే మీడియాకు వెల్లడించారు. ఏపీ వాళ్లు ప్రయాణించినట్లు తెలుస్తోందని.. వారిని వెతికే పనిలో ఉన్నట్లు మీడియాకు నాని వివరించారు. దీంతో ఏపీ ప్రజల్లో మరింత భయం పెరిగింది. నిజంగానే వాళ్లు ఏపీకి చెందిన వాళ్లేనా..? నిజమే అయితే ఆ 17 మంది ఏ ప్రాంతానికి చెందిన వాళ్లు..? వాళ్లకు కూడా కరోనా పాకిందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఏపీలో కరోనా లేదు కానీ..!
ఆ 17 మందిని గుర్తించి వారికి వెంటనే స్క్రీనింగ్ టెస్టులు చేయించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి మీడియాకు వెల్లడించారు.
అవసరమైతే పంచాయతీరాజ్, మున్సిపల్, రవాణ శాఖలతో సమన్వయం చేసుకుంటామన్నారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి వివిధ శాఖలతో ఓ కమిటీ వేయాలని సీఎం జగన్ సూచించారన్నారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి 0866 2410978 నెంబర్ మీద కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే.. ఇప్పటి వరకూ కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంపై లేదన్నారు. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని..
కరోనా వ్యాప్తి నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
కరోనా రాకుండా ఉండాలంటే..!
ప్రపంచాన్ని వణిస్తున్న ఈ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్ అనేది డాప్‌లెట్ ఇన్ ఫెక్షన్‌తో వస్తుందన్నది. మరీ ముఖ్యంగా ముఖ్యంగా దగ్గినప్పుడు ఎదుట వ్యక్తికి త్వరగానే వచ్చేసింది. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ కరోనా వైరస్ సోకుతుందని.. గాలిలో కలిసి అంతటా వ్యాపించదని నిపుణులు చెబుతున్నారు. కాగా.. కరోనా వైరస్ ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు వాడకూడదని వైద్యులు చెబుతున్నారు.
- కరోనా సోకిన వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచాలి
- వాళ్లను తాకిన తర్వాత చేతులు ముక్కు, ముఖం దగ్గర పెట్టుకోకపోతే ఎలాంటి వైరస్ రాదు.
- ఫ్లూ మాదిరిగా లక్షణాలు ఉంటాయి.. ఫ్లూ అయితే చికిత్స తీసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
- ముక్కు కారుడు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసంగా ఉండటం, ఆహారం తీసుకోలేకపోవడం, ఛాతి నొప్పి క్రమేనా పెరిగి శ్వాస తీసుకోలేకపోవడం జరుగుతుంది.. అని వైద్యులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments