`లవ్‌స్టోరీ` `టక్ జగదీష్` సినిమాల మధ్య వివాదం సమసినట్టేనట..
Send us your feedback to audioarticles@vaarta.com
`లవ్‌స్టోరీ`, `టక్ జగదీష్` సినిమాల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య విడుదల తేదీల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో సమస్యను ఇరు నిర్మాతలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాని సినిమా కావడంతో ఈ సినిమాపై కామన్‌గానే అంచనాలు భారీగానే ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో వచ్చిన నాని సినిమా ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వకపోడంతో ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందించిన `లవ్‌స్టోరీ` కూడా అదే డేట్‌ను లాక్ చేసింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ‘లవ్‌స్టోరి’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకే విడుదల తేదీని ఎంచుకోవడం వివాదానికి దారి తీసింది. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు సమావేశమై విడుదల తేదీ విషయంలో ఓ పరిష్కారానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 16న ‘లవ్‌స్టోరీ’ని, ఆ తర్వాత వారం అంటే ఏప్రిల్ 23న ‘టక్ జగదీష్’ను రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు టాక్ నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com