మెగా ‘లూసిఫ‌ర్’ ఆగిందా?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’‌ను రీమేక్ చేయ‌డానికి ఎప్ప‌టి నుండో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ‘సాహో’ ద‌ర్శ‌కుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాడ‌ని, స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నాడ‌ని ఓ సంద‌ర్భంలో చిరంజీవి స్వ‌యంగా తెలిపారు. అయితే రీసెంట్‌గా చిరంజీవిని సుజిత్ కలిశాడట. అయితే స్క్రిప్ట్ పట్ల చిరంజీవికి సుముఖంగా లేడట. దీంతో ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెడ‌దామ‌ని చెప్పాడ‌ట‌. అప్పుడు చిరంజీవి 153వ చిత్రంగా డైరెక్ట‌ర్ బాబీ సినిమా తెర‌కెక్కే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఇప్ప‌టికే బాబీ చెప్పిన పాయింట్ చిరంజీవికి బాగా నచ్చింద‌ట‌. పూర్తి స్క్రిప్ట్‌ను త‌యారుచేసి వినిపించ‌మ‌ని బాబీకి చిరు చెప్పాడ‌ట‌. ఇప్పుడు బాబీ అదే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేయ‌డానికి రెడీగా ఉన్నారు. ఇప్ప‌టికే న‌ల‌బై శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుందీ చిత్రం. క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే సినిమాను స్టార్ట్ చేస్తారు. ఆచార్య‌లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

ఇస్మార్ట్ శంక‌ర్‌కు ఏడాది పూర్తి!!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’.

త‌మ‌న్‌కు గ్రేట్ ఆఫ‌ర్‌?

అంత‌కు ముందు అర‌వింద స‌మేత‌, ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మ‌రో రేంజ్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

రీమేక్ సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు?

తొలి చిత్రం పెళ్ళిచూపులుతో హిట్ కొట్టి ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌.

పసిపాప ప్రాణం కోసం ఫ్లైట్‌లో తల్లిపాలు.. అసలు కథేంటంటే..

కనీసం నెల రోజులు కూడా నిండని పసికందు ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం పాప తల్లిదండ్రులే కాదు..

తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ!

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్క టీటీడీలోనే కరోనా కేసులు 150కి పైగా నమోదయ్యాయి.