చిరు 152కి బాలీవుడ్ హీరో వల్ల ఇబ్బంది కలుగుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ కోకాపేటలో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన. అయితే ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే? పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ సినిమాల నుండి భారీ పోటీగా ఉంటాయి.
ఇప్పటికే అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం భుజ్ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇది పక్కా దేశభక్తి చిత్రం. మరి ఈ సినిమాకు పోటీగా చిరంజీవి సినిమా ఉత్తరాదిన విడుదలవుతుందా? విడుదలైతే అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందా? అనేది సమస్యగా మారింది. ఎందుకంటే చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` సినిమా విడుదల సమయంలో హృతిక్,టైగర్ ష్రాఫ్ వార్ సినిమా విడుదలైంది. వార్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సైరా ఫలితం విషయంలో బాలీవుడ్లో చిరు, రామ్‌చరణ్‌కి నిరాశే మిగిలింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తారో చూడాలి.
చిరు 152 దేవదాయ శాఖలోని అక్రమాలపై రూపొందుతోందని, నక్సలిజం కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో ఉంటుందని, రామ్‌చరణ్ కూడా ఇందులో అతిథి పాత్రలో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. త్రిష హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments