చిరు 152కి బాలీవుడ్ హీరో వ‌ల్ల ఇబ్బంది క‌లుగుతుందా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ కోకాపేట‌లో స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక నిర్మాత‌లు భావిస్తున్నారు. సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌నేది నిర్మాత‌ల ఆలోచన. అయితే ఇక్క‌డొచ్చిన స‌మ‌స్య ఏంటంటే? పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ సినిమాల నుండి భారీ పోటీగా ఉంటాయి.

ఇప్ప‌టికే అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం భుజ్ సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌ల కానుంది. ఇది ప‌క్కా దేశ‌భక్తి చిత్రం. మ‌రి ఈ సినిమాకు పోటీగా చిరంజీవి సినిమా ఉత్త‌రాదిన విడుద‌ల‌వుతుందా? విడుద‌లైతే అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా? అనేది స‌మ‌స్య‌గా మారింది. ఎందుకంటే చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమా విడుద‌ల స‌మ‌యంలో హృతిక్‌,టైగ‌ర్ ష్రాఫ్ వార్ సినిమా విడుద‌లైంది. వార్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో సైరా ఫ‌లితం విష‌యంలో బాలీవుడ్‌లో చిరు, రామ్‌చ‌ర‌ణ్‌కి నిరాశే మిగిలింది. ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని ఫేస్ చేస్తారో చూడాలి.

చిరు 152 దేవ‌దాయ శాఖ‌లోని అక్ర‌మాల‌పై రూపొందుతోందని, న‌క్స‌లిజం కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో ఉంటుందని, రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇందులో అతిథి పాత్ర‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

న‌రేష్‌పై శివాజీరాజా హాట్ కామెంట్స్‌.. త‌మ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

`మా` డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్తించిన తీరుతో మ‌రోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఉన్న లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

'అల వైకుంఠపురంలో..' సెన్సార్ పూర్తి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ‘గర్జన’

మనిషి, జంతువు... వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది...

'నమస్తే నేస్తమా`చిత్రానికి థియేటర్స్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండడం సంతోషంగా ఉంది - దర్శక నిర్మాత  కె.సి బొకాడియా

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో

తనీష్ మహాప్రస్థానం షూటింగ్ పూర్తి

యువ కథానాయకుడు తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై