'ఆర్ఆర్ఆర్‌'ని చిరంజీవి ప్రొడ్యూస్ చేయాల‌నుకున్నారా?

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్‌). టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాను ముందుగా మెగాస్టార్ చిరంజీవి నిర్మించాల‌ని అనుకున్నాడ‌ట‌. ఈ విష‌యంపై రాజ‌మౌళితో చిరంజీవి చ‌ర్చించాడ‌ట‌. కానీ అప్ప‌టికే డి.వి.వి.దాన‌య్య‌తో రాజ‌మౌళి క‌మిట్ అయ్యుండ‌టంతో సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట‌. అలాగే బాహుబ‌లి నిర్మాత‌లు కూడా దాన‌య్య భారీ ఆఫ‌ర్ ఇచ్చి సినిమాను త‌మ‌కు ఇచ్చేయ‌మ‌ని అన్నార‌ట‌. కానీ దాన‌య్య అందుకు ఒప్పుకోలేద‌ట‌. ఆయ‌న నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

పాన్ ఇండియా స్టార్స్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్‌తో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ భామ ఒలివియా మోరిస్ న‌టిస్తుండ‌గా రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది.

More News

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ‘కరోనా’ సర్వే!

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాపై పోరు చేస్తూ సర్వే జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటి వరకూ మూడు సర్వేలు పూర్తి చేయడం జరిగిందన్నారు.

షాకింగ్ : ఏపీలో కరెన్సీ ద్వారా ఇద్దరికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే

‘కమ్మవారు తలచుకుంటే జగన్ లేచిపోతాడు..!’

కరోనా నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల నోళ్లకు మూత పడట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..?

ఆంగ్ల మాధ్యమం: జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అస్సలు ఆగట్లేదు. అధికార పార్టీ మాత్రం దీన్నే అలుసుగా చేసుకుని చేయాల్సినవన్నీ చేసేద్దామని భావిస్తుంటే..

మే-03 వరకు ఇవన్నీ పాటించాల్సిందే.. కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మే-03 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.