చిరంజీవికి విలన్ ఫిక్స్ అయ్యాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌తో బిజి బిజీగా ఉన్నాడు. కాగా.. మరో మూడు సినిమాలను వరుస లైన్‌లో పెట్టేసుకున్నాడు. అందులో ముందుగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి రీమేక్‌గా మోహన్‌రాజా దర్శకత్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తర్వాత తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌ను మోహర్ రమేశ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అలాగే రీసెంట్‌గా డైరెక్టర్ బాబి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నానని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో మెహర్ రమేశ్ కంటే ముందుగా బాబి సినిమానే సెట్స్‌పైకి వెళుతుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై పలు వార్తలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విలన్‌గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో శ్రుతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్‌లలో ఒకరిని హీరోయిన్‌గా తీసుకోవాలని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారట. చిరంజీవి సినిమాలను పూర్తి చేయడంలో చాలా స్పీడు చూపిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండు సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com