చంద్రముఖి2 రానుందా...?
Send us your feedback to audioarticles@vaarta.com
చంద్రముఖి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముందు లకలకలక..డైలాగే. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాబా వంటి డిజాస్టర్ తర్వాత సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రమదే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభినయం అందరి మన్నలు పొందింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి 2 అప్పట్లో చేయాలని దర్శకుడు పి.వాసు అనుకున్నా రజనీకాంత్ చేయననడంతో వెంకటేష్ హీరోగా వాసు నాగవల్లిని తెరకెక్కించాడు.
కానీ ఇప్పుడు మరోసారి చంద్రముఖి 2 పేరు వార్తల్లోకి వచ్చింది. కన్నడంలో శివరాజ్‌కుమార్, వేదిక కాంబినేషన్‌లో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ చిత్రాన్ని ఇప్పుడు పి.వాసు తెరకెక్కిస్తున్నారు. లారెన్స్ హీరోగా తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ చిత్రంలో సాలాఖద్దూస్ ఫేమ్ రితికసింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి తెలుగులో చంద్రముఖి2 అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com