బన్ని మొదటిసారి చేస్తున్నాడు....?
Send us your feedback to audioarticles@vaarta.com
బన్నితమిళ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. రీసెంట్గా అందుకు సంబంధించిన ప్రెస్‌మీట్ జరిగింది. లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్‌రాజా నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ డబుల్ రోల్ చేస్తాడని అందులో ఒకటి నెగటివ్ షేడ్‌తో కూడుకుని ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి.
కథనుగుణంగా రెండు పాత్రల్లో బన్ని లుక్ పరంగా, ఫిజిక్ పరంగా వేరియేషన్స్ చూపించడానికి బన్ని సమయాత్తమవుతున్నాడని టాక్. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం తమిళంలోకి మంచి ఎంట్రీ అవుతుందని బన్ని భావిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments