బ్రూస్ లీ టైటిల్ బ్రూస్ లీ 2 గా మారిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు. డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించారు. దసరా కానుకగా ఈ నెల 16న బ్రూస్ లీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే...బ్రూస్ లీ టైటిల్ కాస్త బ్రూస్ లీ 2 గా మారుతుంది.
అయితే అది తెలుగులో కాదు..తమిళ్ లో. ఎందుకంటే తమిళ్ లో జి.వి.ప్రకాష్ కూడా బ్రూస్ లీ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. అందుకనే తమిళ్ లో రామ్ చరణ్ బ్రూస్ లీ 2 టైటిల్ తో రిలీజ్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో చరణ్ బ్రూస్ లీ చిత్రాన్ని ఒకేరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ బ్రూస్ లీ 2 ఆడియోను చెన్నైలో ఈ నెల7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments