Vijayashanthi: రాములమ్మను బీజేపీ పక్కన పెట్టేసినట్టేనా..? పొమ్మనలేక పొగబెడుతున్నారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్నాయి. బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నేతలు ప్రచారం చేశారు. అయితే ఇంతవరకు ఆ పార్టీలో కీలక నేత, మాజీ స్టార్ హీరోయిన్ విజయశాంతి మాత్రం ఎక్కడా కనపడటం లేదు. కొంతకాలంగా ఆమె బీజేపీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని నియమించారో అప్పటి నుంచి విజయశాంతి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా పరోక్షంగా బీజేపీపై సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆమె పేరు ప్రకటించలేదు.
తాజాగా తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ విజయశాంతి పేరు లేదు. సినీ గ్లామర్‌తో పాటు రాజకీయంగానూ ఫాలోయింగ్ ఉన్న విజయశాంతికి క్యాంపెయినర్ల జాబితాలో స్థానం కల్పించకపోవటం ఆమెను అవమానించడమే అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారని.. అందుకే బీజేపీ పెద్దలు ఆమెను పక్కనపెడుతున్నారని కమలం నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో విజయశాంతి పార్టీ మారనున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.
స్టార్ క్యాపెంయినర్ల జాబితాలో మొత్తం 40 మంది నేతల పేర్లను బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్ర నాయకులు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్‌తో పాటు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురందేశ్వరికి ఈ జాబితాలో చోటు కల్పించారు.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు జాబితా..
జేపీ నడ్డా
అమిత్‌షా
రాజ్‌నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
నిర్మలా సీతారామన్
స్మృతి ఇరానీ
పీయూష్ గోయల్
పురుషోత్తం రూపాలా
అర్జున్ ముండా
సాధ్వి నిరంజన్ జ్యోతి
భూపేంద్రయాదవ్
ప్రకాశ్ జావడేకర్
ఎల్.మురుగన్
సునీల్ బన్సల్
తరుణ్ ఛుగ్
యోగి ఆదిత్యనాథ్
యడియూరప్ప
రవికిషన్
అరవింద్ మేనన్
కిషన్‌రెడ్డి
కె.లక్ష్మణ్
బండి సంజయ్
డీకే అరుణ
ఈటల రాజేందర్
ధర్మపురి అర్వింద్
రాజాసింగ్
దగ్గుబాటి పురందేశ్వరి
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
పి.మురళీధర్‌రావు
పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సోయం బాపూరావు
బూర నర్సయ్యగౌడ్
బంగారు శ్రుతి
జితేందర్‌రెడ్డి
గరికపాటి మోహన్‌రావు
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
దుగ్యాల ప్రదీప్‌కుమార్
టి.కృష్ణ ప్రసాద్
కాసం వెంకటేశ్వర్లు యాదవ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com