బెల్లంకొండ శ్రీనివాస్‌కి హీరోయిన్ దొరికిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగు సినిమా పాన్ ఇండియాగా మారిన తరుణంలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్లు ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్షకులకు ‘అల్లుడు శీను’ సినిమాతో పరిచయం చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్.. బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. శ్రీనివాస్‌కే కాదు వినాయక్‌కు కూడా ఇదే బాలీవుడ్ డెబ్యూ మూవీ. దర్శకధీరుడు తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాను వినాయక్ ఎలా ప్రెజంట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఈ సినిమా పరంగా ఓ సమస్య చాలా రోజులు వేధించింది... ఆ సమస్య ఏదో కాదు.. సరైన హీరోయిన్ దొరక్కపోవడమే. దర్శక నిర్మాతలు జాన్వీకపూర్, శ్రద్ధాకపూర్, కియార అద్వాని సహా చాలా మంది స్టార్ హీరోయిన్స్‌ను సంప్రదించే ప్రయత్నాలు చేశారు , కానీ ఎవరూ ఒప్పుకోలేదు. ఈ తరుణంలో దిశా పటాని ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తర్వలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com