బాలకృష్ణ ఓకే చెబుతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణకి తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. అది తన ప్రసంగాల్లోనే కాదు.. సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. అందుకే.. పౌరాణికాలకు కాలం చెల్లిన రోజుల్లోనూ తెలుగుదనం ఉన్న ఆ సినిమాల్లో కనిపించి విజయాలను పొందారాయన. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రాల టైటిల్స్ మాత్రం ఆయన శైలికి భిన్నంగా ఇంగ్లీష్ టైటిల్స్‌తో తెరకెక్కుతున్నాయి. 'లెజెండ్'తో మొదలైన ఈ ట్రెండ్ 'లయన్', 'డిక్టేటర్' వరకు కొనసాగింది. అక్కడితో ఆగకుండా.. ఆయన నటించే 100వ చిత్రం కోసం 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ వినిపించేతగా ఆంగ్ల శీర్షికల హవా సాగుతోంది. తన కెరీర్‌లో మైలురాయిలాంటి 100వ సినిమా కోసం బాలకృష్ణ ఈ తరహా ఇంగ్లీష్ టైటిల్ కే ఓకే చెబుతాడా లేదంటే.. తెలుగుదనంకి ప్రాముఖ్యత ఇస్తాడో చూడాలంటున్నాయి సినీ వర్గాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com