బాల‌య్య మ‌రోసారి ఆ సాహ‌సం చేస్తాడా?

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

ఈ హెడ్డింగ్ చ‌ద‌వ‌గానే అస‌లు బాల‌కృష్ణ ఏ సాహసాన్ని చేయ‌డానికి ఆలోచిస్తాడు? అనే సందేహం రాక‌మాన‌దు. ఇంత‌కు ఆ సాహ‌సం ఏంటో తెలుసా..మ‌రోసారి త‌న తండ్రి దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించ‌డం. ఇది వ‌రకే బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మించిన సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్ పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌కు నోచుకోలేదు. ఓ ర‌కంగా ఈ బ‌యోపిక్ బాల‌కృష్ణ‌ను తీవ్ర నిరాశ ప‌రిచింద‌నే చెప్పాలి. కాగా.. ఇప్పుడు బాల‌య్య‌ను మ‌రోసారి ఆయ‌న సీనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టింప చేయాల‌ని నిర్మాత విష్ణు ఇందూరి ఆలోచిస్తున్నార‌ట‌. ఎందుకంటే.. విష్ణు ఇందూరి నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'త‌లైవి'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా... ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో స్టార్ట్ అయ్యింది. త‌మిళనాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఇది.

జ‌య‌ల‌లిత రాజ‌కీయాల్లోకి రాక మునుపు సినిమా రంగంలో అగ్ర హీరోయిన్‌గా వెలిగారు. అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితోనూ క‌లిసి నటించారు. అలా ఆమె అప్ప‌ట్లో సీనియ‌ర్ ఎన్టీఆర్‌తోనూ న‌టించారు. ఇప్పుడు ఈ బ‌యోపిక్‌లో జ‌య‌లలిత సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. అందులో ఎన్టీఆర్ పాత్ర‌ను కూడా చూపించ‌బోతున్నార‌ట‌. ఆ ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ‌ను న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ట విష్ణు ఇందూరి. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' నిర్మాత‌ల్లో విష్ణు ఇందూరి ఒక‌రు. ఆ ప‌రిచ‌యంతో విష్ణు ఇందూరి బాల‌య్య‌ను సంప్ర‌దించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని టాక్‌. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ఏపీలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తే జైలుకే.

ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లిష్‌ మీడియం బోధన, మొక్కజొన్న ధరలు పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లిష్‌ మీడియం బోధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది.

నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు.

సుప్రీం సంచలన తీర్పు.. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ

దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇకపై సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి రానుంది. ఆర్టీఐ పరిధిలో సీజేఐ కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

'ప్రతిరోజు పండగే' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా