ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను బాలయ్య స్వీకరిస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. కొంత మంది మధ్య కొన్ని ఛాలెంజ్‌లు నడిచినప్పటికీ, లేటెస్ట్గా ‘బీ ద రియల్‌మేన్’ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది సందీప్ వంగా రాజమౌళికి ఛాలెంజ్ చేయగా రాజమౌళి చరణ్, తారక్ సహా మరికొంత మందికి ఛాలెంజ్ చేశారు. వీరిలో రామ్‌చరణ్ కొంత మందికి, ఎన్టీఆర్ కొంతమందిని ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. ఇందులోఎన్టీఆర్ బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కొరటాల శివను నామినేట్ చేశారు. ఎన్టీఆర్ ఛాలెంజ్‌కు కొరటాల శివ ఒప్పుకుంటున్నానని మెసేజ్ చేయగా చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో ఓ సీన్‌ను పోస్ట్ చేసి ఐయామ్ వెయిటింగ్ అంటూ సిద్ధమని చెప్పారు తారక్‌కి. అయితే మరో ఇద్దరూ స్టార్స్ నాగార్జున, వెంకటేశ్‌లు కూడా ఓకే చెబుతారనడంలో సందేహం లేదు.
అయితే మరి వీరిలో బాలకృష్ణ ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకుంటాడా? ముఖ్యంగా తారక్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తాడా? అనేది అందరిలో డౌట్‌గానే ఉంది. కొంతకాలంగా బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య మాటలు లేవనేది వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ బీ ద రియల్ మేన్ ఛాలెంజ్‌కు ఒప్పుకుంటే గొప్పేనని అంటున్నారు కొందరు. మరి బాలయ్య నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడే చెప్పలేం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments