బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా సెకండ్ షెడ్యూల్ వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తదుపరి చిత్రాన్ని బి.గోపాల్ దర్శకత్వంలో చేయాలనుకుంటున్నారు. కాగా.. నిర్మాత సూర్య దేవర నాగవంశీ తన బ్యానర్లో చేయబోయే సినిమా కోసం బాలయ్యను అప్రోచ్ కావాలనుకుంటున్నారట. వివరాల్లోకెళ్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రీమేక్ చేయడానికి మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా హక్కులను దక్కించుకున్నారట.
మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఓ రిటైర్డ్ హవల్దార్, పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే ఈగో వార్ ఆధారంగా సినిమా సాగుతుంది. ఇందులో ఓ పాత్రలో బాలకృష్ణను నటింప చేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు బాలయ్య నిర్మాతలు అప్రోచ్ అయ్యారా? లేక ఇవి పుకార్లు మాత్రమేనా? ఇందులో నిజా నిజాలు ఏంటనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com