అవినాష్ మాస్క్‌ని తొలగిస్తున్నాడా?
- IndiaGlitz, [Thursday,October 15 2020]
నిన్నటి అమితుమీ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. బిగ్‌బాస్ డీల్ ఇస్తారు. దానిని చేసిన వాళ్లు కొన్నిగోల్డ్ కాయిన్స్ సంచాలకుడికి ఇచ్చి తమ వద్ద ఉన్న కాయిన్స్‌ను తగ్గించుకోవాలి. ఎవరి దగ్గర తక్కువ కాయిన్స్ ఉంటే ఆ గ్రూపు కెప్టెన్సీ టాస్క్‌కి సెలక్ట్ అవుతుంది. నేటి షోలో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన డీల్ ప్రకారం ఎవరైనా అరగుండుతో పాటు సగం షేవ్ చేసుకోవాలి. దీనికి మొదట అఖిల్ టీం నుంచి అమ్మ రాజశేఖర్ ఓకే అన్నప్పటికీ అపోజిట్ టీం మెంబర్స్ అయిన అభి, అవినాష్ వద్దని వారించడంతో అమ్మ రాజశేఖర్ ఆగిపోయారు. ఈ డీల్‌ని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బిగ్‌బాస్ క్యాన్సిల్ చేశారు. నెక్ట్స్ టాస్క్ బురదలో ఉన్న 100 బటన్స్‌ని బయటకు తీయాలి. దీనిని చేసేందుకు దివి వెళ్లింది. నెక్ట్స్ టాస్క్.. స్టాకింగ్ తలకు వేసుకుని అరటిపండ్లు తినాలి. దీనికి 10 కాయిన్స్ మాత్రమే అని చెప్పడంతో అఖిల్ డ్రాప్ అయ్యాడు.
అరియానా బెల్ మోగించడంతో దానిని అవినాష్ కంప్లీట్ చేశాడు. నెక్ట్స్ డీల్.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక కుర్చీలో సభ్యుడు కూర్చుంటే.. వేరే టీం వాళ్లు వాష్ చేసి వారిని కుర్చీ నుంచి లేపాలి. ఈ డీల్ కోసం 25 బంగారు నాణేలు చెల్లించాలి. ఈ డీల్‌ని చేసేందుకు అఖిల్ ముందుకు వచ్చాడు. అఖిల్ కుర్చీలో కూర్చుంటే లేపేందుకు వేరే టీం సభ్యులు సోప్ వాటర్ పోశారు. పేస్ట్ రాశారు. ఒక వైపు దివి బటన్స్ ఏరుతుంటే మరోవైపు షాంపు వాటర్ పోస్తూ అఖిల్‌ని బాగా ఇరిటేట్ చేశారు. మోనాల్ నీళ్లు పోసేందుకు యత్నించినా అభి ఆపేశాడు. అఖిల్‌కి కళ్లు మండుతుంటే నోయెల్ కళ్లు తుడిచేందుకు ట్రై చేసినా అఖి వద్దని చెప్పాడు. దీంతో చిన్నపాటి గొడవ జరిగింది. చివరకు డీల్‌ని అఖిల్ గెలిచాడు. బటన్స్‌ని దివి 93 మాత్రమే తీయడంతో డీల్ గెలవలేదు.
అవినాష్ మెల్లిమెల్లిగా మాస్క్ తొలగిస్తున్నాడు. కౌశల్‌కి నిమ్మకాయ పిండటంతో అప్పుడు అవతలి టీం జనాల్లో విలన్స్ అయ్యారు. ఇది అవినాష్‌కి బాగా ఎక్కినట్టుంది. ఎక్కడ సింపతి కొట్టేస్తారోనని తెగ భయపడ్డాడు. బరాబర్ సేఫ్ గేమ్ ఆడతానంటూ మండిపడ్డారు. జనాల్లో మేము విలన్స్ అవుతామంటూ తెగ ఫైర్ అయిపోయాడు. ఎంత కాలమని మాస్క్ వేసుకుని ఉండగలరు. ఎప్పుడోకప్పుడు తొలగించాలిగా.. అదే జరుగుతున్నట్టు అనిపించింది. అవినాష్ కోపంలో మాటలు జారడంతో సొహైల్‌కి బీభత్సంగా కోపం వచ్చింది. కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ ఫ్రస్టేషన్‌ని టేబుల్‌పై చూపించాడు. దీంతో సొహైల్‌పై అఖిల్ బాగా సీరియస్ అయ్యాడు. ఇలా చేయవద్దని వారించాడు. నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవద్దని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. బిగ్‌బాస్ చివరి డీల్ ఇచ్చారు. ఎవరో ఒకరు తదుపరి వారంలో నేరుగా నామినేట్ అవ్వాలి. దీనికోసం 30 గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి. నోయెల్ నేరుగా నామినేట్ అయ్యేందుకు ముందుకు వచ్చాడు. ఫైనల్‌గా అఖిల్ టీం ఈ టాస్క్‌ని గెలుపొంది కెప్టెన్సీ టాస్క్‌లో నిలిచింది.
రాఘవేంద్ర సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో కనిపించే ప్రభాస్‌లా సొహైల్ మారిపోయాడు. కానీ ఫ్రస్టేషన్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నా తప్పు లేకున్నా బాధ పెడుతున్నారని పసిపిల్లవాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పవర్ స్టార్ సాంగ్‌తో నెక్ట్స్ డే స్టార్ట్ అయింది. మళ్లీ అవినాష్.. అరియానాను పిలిచి యూ ఆర్ కూల్ అని చెప్పాడు. మరోవైపు మోనాల్ ఏం చేస్తే అది చేస్తూ అఖిల్ ఆట పట్టించాడు. కెప్టెన్సీ టాస్క్ పేరు.. ‘కొట్టు.. తలతో ఢీకొట్టు’. బాల్స్ అన్నీ తలకు కట్టిన బ్యాట్‌తో గోల్ వేయాలి. టాస్క్ స్టార్ట్ అయింది. గెలిచిన టీం మెంబర్స్ అంతా బాల్స్‌ని గోల్ వేయడం స్టార్ట్ చేశారు. ఈ గేమ్ మాత్రం చాలా ఫన్నీగా నడిచింది. నోయెల్ కెప్టెన్సీ టాస్క్‌ని విన్ అయి.. కెప్టెన్ అయ్యాడు. నేరుగా నామినేట్ చేసుకున్నందుకు నెక్ట్స్ వీక్ నోయెల్‌కు ఇమ్యూనిటీ లభించలేదు. ఇక మెహబూబ్‌ని నోయెల్ రేషన్ మేనేజర్‌ని చేశాడు. రేపు ఫన్నీ ఫన్నీగా షో నడుస్తుందని ప్రోమోని బట్టి తెలుస్తోంది.