మహేశ్‌కు సెకండ్ హీరోయిన్ దొరికినట్టేనా?
- IndiaGlitz, [Wednesday,August 05 2020]
సూపర్‌స్టార్ మహేశ్.. లాక్డౌన్ పుణ్యమాని ఇంటికే పరిమితమయ్యారు. ఖాళీ సమయాన్నంతా గౌతమ్, సితారతో ఎంజాయ్ చేస్తున్నారు. మరో పక్క మహేశ్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ అనౌన్స్మెంట్ జరిగింది. షూటింగ్‌కు వెళ్దామంటే.. కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గలేదు. ఒక వైపు మహేశ్ అభిమానులు ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సెకండ్ హీరోయిన్గా నటించనుందనే వార్తలు లేటెస్ట్గా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.
వివరాల మేరకు.. ‘సర్కారు వారి పేట’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. అందులో ఓ హీరోయిన్గా కీర్తి సురేశ్ నటించడం పక్కా అయ్యింది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ప్లేస్‌లో అనన్య పాండేను సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఆగస్ట్ 9న మహేశ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే సినిమా షూటింగ్ మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.