ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ ని బన్ని చేస్తున్నాడా..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డి.జె దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బన్ని సరసన ముకుంద, ఒక లైలా కోసం చిత్రాల్లో నటించిన పూజా హేగ్డే నటిస్తుంది. తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపించే బన్ని ఈసారి కూడా డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు.
బ్రాహ్మణ యువకుడుగా ఈ చిత్రంలో కనిపిస్తాడని తెలిసింది. ఈ క్యారెక్టర్ కోసం బన్ని డైలాగ్స్ & బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో బ్రాహ్మణ యువకుడుగా నటించి అదుర్స్ అనిపించాడు. మరి...బ్రాహ్మణ యువకుడుగా బన్ని ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments