హీరోయిన్ భర్తతో విడిపోనుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
నాయక్, ఇద్దరమ్మాయిలతో, రీసెంట్ గా మేము సహా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ను 2014లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అనోన్యంగా ఉంటున్న వీరి మధ్య చెడిందని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్త చెన్నై ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. విడాకులు ఎందుకు తీసుకోనున్నారనే కారణాలు కచ్చితంగా తెలియడం లేదు కానీ ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని, అందుకే అమలాపాల్ వరుసగా సినిమా అవకాశాలను వెతుక్కుంటోందని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు విజయ్ తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ కాంబినేషన్లో అభినేత్రి సినిమాను రూపొందిస్తున్నాడు. మరి ఈ వార్తలపై భార్యభర్తలెలా స్పందిస్తారో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com