అలీ పనైపోయింది.. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీనే!?

  • IndiaGlitz, [Monday,February 25 2019]

రాజకీయాల్లోకి రావాలన్న చిరకాల కోరిక తీర్చుకోవడానికి కమెడియన్ అలీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌ను మొదలుకుని టీడీపీ అధినేత, జనసేన అధినేత ఇలా అందర్నీ కలిసిన ఆయన చివరికి ఎక్కడా అవకాశాల్లేకపోవడంతో మిన్నకుండిపోయి యథావిథిగా షోలు, సినిమాలు చూస్కుంటున్నాడట. అయితే ఇటీవల చంద్రబాబుతో అలీకి బాగా బాండింగ్ ఏర్పడిందని రాజమండ్రి లేదా గుంటూరు నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కోస్తాంధ్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదేగాని వర్కవుట్ అయితే అలీ ఆశలు ఆవిరికాకుండా ఫలించినట్లే.. చిరకాల కోరిక నెరవేరినట్లే మరి.

ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విషయానికొస్తే.. మంచి వాక్‌చాతుర్యం, గట్టిగా మాట్లాడిగలికే దమ్ము, ప్రత్యర్థులపై కౌంటర్లు పేల్చేందుకు ముందు వరుసలో ఉండే పృథ్వీ వైసీపీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టింది. ఇక ఆ పదవి వచ్చినప్పట్నుంచీ ఆయనకు కళ్లెం వేసి ఆపుదామనుకున్నా ఆగట్లేదు.. మీడియా మీట్‌‌లు పెట్టి వాళ్లు వీళ్లు అని కాకుండా అందర్నీ దుమ్ముదులిపి వదులుతున్నారు. ఆఖరికి మెగా ఫ్యామిలీని సైతం టార్గెట్ చేసి తనదైన విమర్శలు గుప్పించారాయన.

పార్టీ గుర్తించింది.. పదవి ఇచ్చింది.. ఇంత వరకూ అంతా ఓకే గానీ ఇక మిగిలిందల్లా ఒకే ఒక్కటే. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి తన దమ్మేంటో నిరూపించుకోవడమేనట. తనకున్న అనుభవాన్ని, పరిచయాలన్ని అన్నీ బేరీజు చేసుకుని అవసరమైతే సర్వేలు కూడా చేయించుకుని సొంతూరైన తాడేపల్లిగూడెం టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని ఆయన పట్టుబట్టారట. సొంత నియోజకవర్గంలో గెలవాలన్నది ఆయన డ్రీమ్ ప్రాజెక్టట. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ పొత్తు వల్ల ఈ సీటు బీజేపీకెళ్లడంతో పైడికొండల మాణిక్యాలరావుకు వెళ్లింది ఆయన గెలిచారు మంత్రి కూడా అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు.. పైగా అక్కడ టీడీపీకి సరైన అభ్యర్థి లేరట. అందుకే తనకు టికెట్ ఇస్తే సామాజిక వర్గమే కాదు అన్ని విధాలుగా కలిసొస్తుందని ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలెట్టేశారట.

అయితే మొన్నటి వరకు టికెట్ చెప్పులు అరిగేలా తిరిగిన అలీకి ఎక్కడా టికెట్ వర్కవుట్ అవ్వకపోవడంతో సైలెంట్ అపోయినట్లు కనిపిస్తున్నారు.! ఇప్పుడిక పృథ్వీ వంతు వచ్చిందన్న మాట. అయితే ఈయన ఎంత మాత్రం సీటు దక్కించుకుంటారో..? సీటు దక్కించుకొని ఏ మాత్రం గెలుపొందుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

వ‌న్ మెన్ ఆర్మీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

సందీప్ చీలంను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ అను ప్రొడక్షన్స్ & మ్యాజిక్ ఫ్రేమ్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న సినిమా వ‌న్ మెన్ ఆర్మీ.

'సైరా', 'కాటమరాయుడు' గురించి పవన్ ఏమన్నారంటే...

టైటిల్ చూడగానే తమ్ముడు 'కాటమరాయుడు' ఆల్రెడీ చూసేశాం.. ఇక మిగిలింది చిరంజీవి 'సైరా'నే కదా అని అనుకుంటున్నారా..? ఇది మీరు అనుకుంటున్నట్లుగా ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు అస్సలు కానేకాదండోయ్

'జనసేన' లేనిదే తెలుగు రాష్ట్రాల రాజకీయాలుండవ్

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలుండటంతో జనసేనాని జోరు పెంచారు. ఇప్పటికే కోస్తాఆంధ్రలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, ఆత్మీయుల సమావేశాలు పెట్టి జనసైన్యం

గ‌ర్వ‌ప‌డే ఆయ‌న అభిమానిని అంటూ నాని...

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సందడి చేయ‌డానికి సిద్ధ‌మైపోతున్నాడు. జెర్సీ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న నాని..

ముళ్ల పంది.. మహా లఫూట్ ఏంటీ రచ్చ ఆర్జీవీ!

అంతా నా ఇష్టం.. నేనింతే ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా నాకు ఓకే.. నా దారి రహదారి కాదు అడ్డదారి.. సంచనాలకు కేరాఫ్ నేనే..