అఖిల్ సినిమా నితిన్‌ చేస్తున్నాడా..?

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

అఖిల్‌, నితిన్‌ మంచి స్నేహితులు. ఆ స్నేహం కార‌ణంగానే అఖిల్ న‌టించిన తొలి చిత్రం అఖిల్‌ను నితిన్ నిర్మాత‌గా రూపొందించాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సంగతిని పక్కకు పెడితే, ఇప్పుడు అఖిల్ రెండో సినిమాకు సంబంధించిన వార్త‌లు చాలానే విన‌ప‌డుతున్నాయి. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ రెండో సినిమా చేస్తున్నాడ‌ని అనుకున్నారు.

కాగా ఈ సినిమా కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల అట‌కెక్కింద‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు విన‌ప‌డ్డాయి. ఇందులో నిజానిజాలెంతో తెలియ‌లేదు కానీ రీసెంట్‌గా హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రంలో అఖిల్ స్థానంలో నితిన్‌ను తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. త‌న స్నేహితుడు మాట‌ను కాద‌ని నితిన్ ఈ సినిమా చేస్తాడా ఏమో చూడాలి మ‌రి...