'అదిరింది'.. కమల్ సినిమానా?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ మూడు పాత్రల్లో నటించిన తమిళ చిత్రం మెర్సల్.. తెలుగులో అదిరింది పేరుతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించారు. దీపావళి కానుకగా తమిళ్, తెలుగు భాషల్లో ఒకే సారి విడుదల కానుందీ సినిమా.
ఇదిలా ఉంటే.. అదిరింది చిత్రం కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులుకి కొత్త వెర్షన్‌లా ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. ఆ సినిమాలో కమల్ హాసన్ మూడు పాత్రల్లో నటిస్తే.. విజయ్ కూడా మూడు పాత్రలే చేశాడీ సినిమాలో. అందులో కమల్ మెజీషియన్‌గా కనిపిస్తే.. ఇందులోనూ విజయ్ ఓ పాత్ర కోసం ఇంద్రజాలికుడుగా కనిపించనున్నాడు. అయితే ఆ సినిమాలో మరుగుజ్జుగా ఆ పాత్ర ఉంటుంది. ఇందులో ఉండదు. అంతే తేడా. అదిరింది.. కమల్ విచిత్ర సోదరులు ఛాయలోనే ఉండే సినిమానా? కాదా? అనేది త్వరలోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com