Sai Pallavi : రౌడీ బేబి సినిమాలపై నో అప్‌డేట్...సాయిపల్లవి సంచలన నిర్ణయం తీసుకున్నారా...?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి రోజుల్లో హీరోయిన్లంటే స్కిన్ షో, హాట్ ఫోటో షూట్‌లు, అందాల అరబోతలు, లిప్ లాక్స్‌కే పరిమితమవుతున్నారు. కాని కొందరు మాత్రం కోట్లు ఇచ్చినా నటనకు, కథకే తమ తొలి ఓటని తేల్చిచెబుతూ.. స్టార్ హీరోయిన్లుగా దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో వుంటారు సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు వారిని కట్టిపడేసిన సాయిపల్లవి... తర్వాత తాను అందాల అరబోతకు దూరమని చెబుతూ, సెలక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. అద్భుతమైన నటిగా, లేడీ పవర్‌స్టార్‌గా అభిమానుల చేత ప్రశంసలు పొందుతోంది.
గార్గి తర్వాత ఒక్క సినిమా కూడా ప్రకటించని సాయిపల్లవి:
అయితే ఈ అమ్మడు కొత్త ఏ సినిమాకూ కమిట్ అయినట్లుగా ఎలాంటి న్యూస్ వినిపించడం లేదు. చివరిగా సాయిపల్లవి నటించిన సినిమా గార్గి. లేడీ ఓరియెంటెడ్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇలాంటి హిట్ తర్వాత కూడా సాయి పల్లవి తన కొత్త సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
కోయంబత్తూరులో సిస్టర్‌తో కలిసి ఆసుపత్రి నిర్మాణం:
కాగా.. చాలా మంది స్టార్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పుకుంటూ వుంటారు. అయితే సాయిపల్లవి విషయంలో దీనికి రివర్స్‌లో జరిగింది. ఆమె జార్జియాలో వైద్య విద్యను అభ్యసించారు. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి సాయిపల్లవి తన స్వస్థలం కోయంబత్తూరులో సొంతంగా ఓ హాస్పిటల్‌ను నిర్మిస్తోన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇకపై సినిమాలకు గుడ్‌బై చెప్పేసి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారట. ఈ ఆసుపత్రి కార్యకలాపాలను సాయిపల్లవితో పాటు ఆమె సోదరి పూజా కలిసి నిర్వహిస్తారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి నిర్మాణం, ప్రాక్టీస్ మొదలుపెట్టే ఉద్దేశంతోనే సాయిపల్లవి సినిమాలకు దూరంగా వున్నారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే వెండి తెరకు అద్భుతమైన నటి దూరమైనట్లే. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com