‘ఆచార్య’ క‌థ రిజిష్ట‌ర్ కాలేదా...!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా కాపీ రైట్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. రాజేష్ అనే స‌హాయ ద‌ర్శ‌కుడు ‘ఆచార్య’ క‌థ త‌న‌దంటూ ర‌చ్చ‌కెక్కాడు. అస‌లు మోష‌న్ పోస్ట‌ర్ చూసి ‘ఆచార్య’ సినిమా క‌థ‌ను త‌మ క‌థ అని ఎలాగంటారు? అని కొర‌టాల కౌంట‌ర్ ఇచ్చాడు. టాలీవుడ్‌లో ఇదొక పెద్ద ర‌చ్చ అయ్యింది. ఓ సినిమా మేకింగ్‌లో ఉన్న‌ప్పుడు ఇలాంటి స‌మ‌స్య ఎదురైతే రెండు క‌థ‌ల‌ను రైట‌ర్స్ అసోషియేష‌న్ పెద్ద‌లు ప‌క్క‌న కూర్చుని బేరీజు వేస్తారు. దీనిపై ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు.

కానీ ఆచార్య విష‌యంలో అస‌లు స‌మ‌స్య ఒక‌టి వ‌చ్చింది. అదేంటంటే రాజేష్ అనే స‌హాయ ద‌ర్శ‌కుడు ఓ పాయింట్‌ను అనుకుని దాన్ని బేస్ చేసుకుని క‌థ‌ను రాసుకుని రిజిష్ట‌ర్ చేయించుకున్నాడు. కానీ.. కొర‌టాల శివ ‘ఆచార్య’ క‌థ‌ను రిజిష్ట‌ర్ చేయించ‌లేదు. అలా చేయిస్తే పాయింట్ బ‌య‌ట‌కు వెళ్లిపోతుంద‌ని ఆయ‌న భావించాడు. ఇప్పుడు అదే ఆయ‌న‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇప్పుడు ఈ కాపీరైట్ వివాదం ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే న‌ల‌బై శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్‌ను క‌రోనా ఎఫెక్ట్ తగ్గిన త‌ర్వాత ప్రారంభిస్తారు.

More News

రియాకు సుశాంత్ సోదరి స్ట్రాంగ్ కౌంటర్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది.

సినీ ఆర్టిస్టులకు భారీ విరాళం అందజేసిన సూర్య..

కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినీ ఆర్టిస్టులను ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకొచ్చారు.

'గుర్తుందా శీతాకాలం' చిత్రం షూటింగ్ ప్రారంభం

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా

139 మంది అత్యాచారం కేసులో కీలకంగా మారిన ‘డాలర్ బాయ్’..

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్-4కి ముహూర్తం ఫిక్స్..

‘బిగ్‌బాస్’ సీజన్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూసే ప్రేక్షకులకు షో యాజమాన్యం తేదీని ప్రకటించేసింది.