సినిమాల్లోకి ఇర్ఫాన్ ఖాన్‌

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

న్యూర్ ఎండో క్రైన్ ట్యూమ‌ర్‌తో ఇబ్బంది ప‌డి చికిత్స కోసం విదేశాల‌కు వెళ్లాడు బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌. త‌ర్వాత ఈ న‌టుడి ఆరోగ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపించాయి. కాగా ఇర్ఫాన్ ఖాన్ స్నేహితుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సూజిత్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

ప్ర‌స్తుతం ఇర్ఫాన్ ఆరోగ్య ప‌రిస్థితి బావుంది. త్వ‌ర‌లోనే ఆయ‌న ఉద్ధ‌మ్ సింగ్ బ‌యోపిక్‌లో న‌టిస్తారు అని ట్వీట్ పెట్ట‌డం గ‌మ‌నార్హం.

సూజిత్ స‌ర్కార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉద్థ‌మ్ సింగ్‌లో ముందు ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించినా.. ఇప్పుడు ఇర్ఫాన్ న‌టించ‌డం ఖాయ‌మైంది. పంజాబ్ లెఫ్టినెంట్ గవ‌ర్న‌ర్‌ను మ‌ట్టుబెట్టిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉద్ధ‌మ్ సింగ్‌.