కంటతడి పెట్టిస్తున్న ఇర్ఫాన్ చివరి మాటలు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 2018 మార్చి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అప్పట్నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యే ఆయన తల్లి కన్నుమూయడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. గత శనివారం తల్లి సయిదాబేగం మృతి చెందగా.. కనీసం అంత్యక్రియలకు కూడా పోలేని పరిస్థితి. ముంబైలోనే ఉండిపోయిన ఇర్ఫాన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే తల్లి మరణించి వారం కూడా అవ్వక మునుపే ఇర్ఫాన్ తుది శ్వాస విడవటం యావత్ సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఇర్ఫాన్ ఇంట వరుస విషాద ఛాయలు అలుముకున్నాయి.
అమ్మ వచ్చేసింది..!
ఇదిలా ఉంటే.. ఆయన చివరి క్షణాల్లో ఆయన మాట్లాడిన మాటలు అభిమానులు, ఆత్మీయులు, ఆప్తులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇర్ఫాన్ మాటలు విన్న ఆయన మిత్రులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ నన్ను తీసుకెళ్లాడినికి మా అమ్మ వచ్చింది.. మా అమ్మ దగ్గరికి వెళ్లిపోతున్నాను’ అని చివరి క్షణాల్లో అన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలకు సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
భార్య కోసం బతుకుదామనుకున్నా..!
ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర, భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా భార్య సూతప సిక్దార్ గురించి చెబుతూ ఆయన కంటతడిపెట్టారు. ‘కేన్సర్ బాధపడుతున్న నేను నా భార్య కోసం అయినా బతకాలి. కేన్సర్ సోకిందని తెలిసి 24 గంటలూ నాతోనే ఉండేది. ప్రతి క్షణం నన్ను జాగ్రత్తగా చూసుకునేది. నాకు ఇన్ని సేవలు చేసి.. నాలో ప్రోత్సాహం నింపింది. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే నా భార్యే కారణం.. భార్య కోసం బతుకుదామని అనుకుంటున్నాను’ అని చెప్పారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఇర్ఫాన్ ఇక తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఆయనకు ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చి.. కుటుంబ సభ్యులకు ఎటువంటి కష్టాలు రాకుండా.. చల్లగా చూడాలని www.indiaglitz.com టీమ్ కోరుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments