కంటతడి పెట్టిస్తున్న ఇర్ఫాన్ చివరి మాటలు!

  • IndiaGlitz, [Wednesday,April 29 2020]

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 2018 మార్చి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అప్పట్నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యే ఆయన తల్లి కన్నుమూయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. గత శనివారం తల్లి సయిదాబేగం మృతి చెందగా.. కనీసం అంత్యక్రియలకు కూడా పోలేని పరిస్థితి. ముంబైలోనే ఉండిపోయిన ఇర్ఫాన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే తల్లి మరణించి వారం కూడా అవ్వక మునుపే ఇర్ఫాన్ తుది శ్వాస విడవటం యావత్ సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఇర్ఫాన్ ఇంట వరుస విషాద ఛాయలు అలుముకున్నాయి.

అమ్మ వచ్చేసింది..!

ఇదిలా ఉంటే.. ఆయన చివరి క్షణాల్లో ఆయన మాట్లాడిన మాటలు అభిమానులు, ఆత్మీయులు, ఆప్తులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇర్ఫాన్ మాటలు విన్న ఆయన మిత్రులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ నన్ను తీసుకెళ్లాడినికి మా అమ్మ వచ్చింది.. మా అమ్మ దగ్గరికి వెళ్లిపోతున్నాను’ అని చివరి క్షణాల్లో అన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలకు సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

భార్య కోసం బతుకుదామనుకున్నా..!

ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర, భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా భార్య సూతప సిక్దార్ గురించి చెబుతూ ఆయన కంటతడిపెట్టారు. ‘కేన్సర్ బాధపడుతున్న నేను నా భార్య కోసం అయినా బతకాలి. కేన్సర్ సోకిందని తెలిసి 24 గంటలూ నాతోనే ఉండేది. ప్రతి క్షణం నన్ను జాగ్రత్తగా చూసుకునేది. నాకు ఇన్ని సేవలు చేసి.. నాలో ప్రోత్సాహం నింపింది. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే నా భార్యే కారణం.. భార్య కోసం బతుకుదామని అనుకుంటున్నాను’ అని చెప్పారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఇర్ఫాన్ ఇక తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఆయనకు ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చి.. కుటుంబ సభ్యులకు ఎటువంటి కష్టాలు రాకుండా.. చల్లగా చూడాలని www.indiaglitz.com టీమ్ కోరుకుంటోంది.

 
 

More News

శ్రుతికి ఆ వాస‌నంటే ఇష్ట‌మ‌ట‌!!

యూనివర్సల్ స్టార్ కమల్‌హాస‌న్ త‌న‌య శ్రుతిహాస‌న్ కొన్నాళ్ల పాటు ప్రేమ‌, బ్రేకప్ వంటి కార‌ణాల‌తో సినీ రంగానికి దూర‌మైంది. అయితే ఇప్పుడిప్పుడే సినీ రంగంలో మ‌రో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది.

అమ్మ‌ల‌కు అంకితం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్ ఛాలెంజ్‌ల‌ను విసురుకుంటున్నారు.

యూ ట్యూబ్‌లో 'ఇస్మార్ శంక‌ర్' రికార్డ్‌

అప్ప‌టి వ‌ర‌కు చాక్లెట్ బోయ్‌, ల‌వ‌ర్‌బోయ్ అనే ఇమేజ్‌తో సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన రామ్‌ను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌దైన

పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీపై పెదవి విప్పిన చిరు.. ఆనందంలో ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టాలీవుడ్ సీనియర్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీఎం

అన్నీ రూమ‌ర్సేన‌ట‌.. న‌వీన్ క్లారిటీ

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమాను బోయపాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.