‘పవన్.. చేగువేరాను మర్చిపోయి.. కాసినోవాలా!’
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాల్లో కూడా పవన్‌వి అనైతిక బంధాలని, ప్రశ్నించేతత్వాన్ని ఆయన మరిచిపోయారని వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మొదలుకుని.. మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ పలుమార్లు పవన్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇక్బాల్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చెగువీరా తనకు ఆదర్శం అని చెప్పి.. ఆయనను కాకుండా, కాసినోవాను ఆదర్శంగా తీసుకోవడం అభ్యంతరకరమన్నారు. పవన్ కళ్యాణ్ ఒకరిని పెళ్లి చేసుకుని.. మరొకరితో కూడా సంబందం పెట్టుకోవడం అనైతికమన్నారు.
తన వైవాహిక సంబందాలలో ఎలా అనైతికను కనబరిచారో, రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ అదే అనైతిక విలువలను కొనసాగిస్తున్నారన్నారు. గతంలో ప్రశ్నిస్తానని చెప్పి, ఆ తర్వాత ప్రశ్నించకపోవడం కాని, లోకేష్ అవినీతిపై గతంలో మాట్లాడి, తదుపరి మళ్లీ టీడీపీతో రహస్య అవగాహన చేసుకోవడం ఇవన్ని అనైతిక రాజకీయాలకు నిదర్శనమని ఇక్బాల్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వైవాహిక సంబందాలలో అనైతిక వ్యవహారాలు చేసినట్లుగానే, రాజకీయాలలోనూ నడుపుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై విమర్శలను అదే రేంజ్‌లో తిప్పికొట్టే పవన్ కల్యాణ్.. ఇక్బాల్ వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments