IPL 2023 : మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న చెన్నై-గుజరాత్, షెడ్యూల్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2023 సంబంధించి బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి మే 21 వరకు జరగనుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మే 21న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. అయితే ప్లే ఆఫ్‌కు సంబంధించిన తేదీలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. 18 డబుల్ హెడర్లతో కలిపి మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు ఏడు మ్యాచ్‌ల చొప్పున హోంగ్రౌండ్లో, ఏడు మ్యాచ్‌లు బయటి గ్రౌండ్లో తలపడనున్నాయి.
రెండు గ్రూపులుగా జట్లు:
అలాగే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో కోల్‌కతా, రాజస్థాన్ , లక్నో , ముంబై , ఢిల్లీ వుండగా.. గ్రూప్ బీలో సన్ రైజర్స్, ఆర్సీబీ, పంజాబ్, గుజరాత్, చెన్నైలు వున్నాయి. మొహాలి, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. గతేడాది ఐపీఎల్ ట్రోఫిని హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మార్చి 4 నుంచి వుమెన్స్ ఐపీఎల్ :
ఇదిలావుండగా.. ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ను ప్రారంభిస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 26న ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీ ముగిసిన నాలుగు రోజులకే పురుషుల ఐపీఎల్ ప్రారంభం కానుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments