కరోనా ఎఫెక్ట్: కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ వాయిదా

  • IndiaGlitz, [Monday,May 03 2021]

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సెకండ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అంతేకాదు.. అత్యంత సురక్షితమైన బయో బబుల్‌లో గడుపుతున్న ఐపీఎల్ క్రికెటర్లను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలపాలవగా... మరికొందరు కరోనా బారిన పడుతుండటం కలవర పెడుతోంది.

ప్రస్తుతం దేశంలో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా రెండో దశ ఉద్ధృతి తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా తాకింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ రోజు (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. కోల్‌కతా ఫ్రాంచైజీ ఆటగాళ్లు వరుణ్, సందీప్‌నకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేకేఆర్ ఫ్రాంచైజీ తెలిపింది.

More News

కొత్త పార్టీపై ఈటల స్పందన.. అప్పుడు తమ్ముణ్ని.. ఇప్పుడు దెయ్యాన్నా?

అప్పుడు నా తమ్ముడు అని చెప్పుకున్నారు కదా.. ఇప్పుడు ఆ తమ్ముడు దెయ్యం అయ్యాడా?

కరోనా రోగుల కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున కరోనా బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

వానతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమి

మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. దక్షిణ కోయంబత్తూరులో ఆయన పోటీ చేశారు.

కర్ఫ్యూతో ప్రయోజనం లేదు.. కఠిన లాక్‌డౌన్‌ అవసరం: ఎయిమ్స్‌ చీఫ్‌

భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణ స్థితికి చేరుకుంటాయని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణ్‌దీప్‌ గులేరియా

ప్రత్యక్ష రాజకీయాలకు జానారెడ్డి గుడ్‌‌బై

ప్రత్యక్ష రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గుడ్ బై చెప్పారు.