Allu Arjun:బన్నీ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. తగ్గేదేలే.. సేమ్ టు సేమ్..

  • IndiaGlitz, [Friday,March 29 2024]

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటనకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సృష్టించాడు. దీంతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దుబాయ్‌లోని మ్యూజియంలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని బన్నీ స్వయంగా ఆవిష్కరించారు. 'అలవైకుంఠపురంలో' మూవీలోని కాస్ట్యూమ్‌తో 'పుష్ప' మూవీలోని తగ్గేదేలే మేనరిజంతో ఈ విగ్రహం తయారుచేశారు.

ఈ కార్యక్రమానికి బన్నీ ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లాడు. తన మైనపు విగ్రహం లాంఛ్ చేసిన సమయంలో బన్నీ కూతురు అల్లు అర్హ కూడా సందడి చేసింది. ఆ విగ్రహం పక్కన తండ్రి కుమార్తె ఇద్దరు తగ్గేదేలే అంటూ ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ మైనపు విగ్రహంతో బన్నీ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తగ్గేదేలే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం మైనపు విగ్రహంతో అల్లు అర్జున్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫొటోల్లో బన్నీకి, మైనపు విగ్రహానికి ఏ మాత్రం తేడా లేదు. డ్రెస్సింగ్ నుంచి గడ్డం, జుట్టు అంతా ఒకేలా ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సేమ్ టూ సేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే మన తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆ రెండు విగ్రహాలు లండన్‌లోని మ్యూజియంలో ఉండగా బన్నీది మాత్రం దుబాయ్‌లో ఏర్పాటు చేయడం విశేషం.

ఇదిలా ఉంటే బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పుష్ప2' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 90శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా మొదలుపెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు 'పుష్ప2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

More News

Kadiyam vs Rajaiah: కడియంకు చెక్‌ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఎంపీగా రాజయ్య పోటీ!

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

Pawan Kalyan:పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్‌ ప్రచారం.. తొలి విడత షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తుండగా..

Tamilisai: ఎన్నికల్లో వరుస ఓటములపై తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు

గతంలో తాను పోటీ చేసి అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP Final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల.. గంటా పోటీ అక్కడి నుంచే..

పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్

Kadiyam Srihari:ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్

వెళ్లాలని భావిస్తున్న మాజీ మంత్రి కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.