ఇంట్లో దెయ్యం నాకేం భయం సెన్సార్ పూర్తి..!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన హర్రర్ ఎంటర్ టైనర్ ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. హర్రర్, ఎంటర్ టైన్మెంట్, సస్పెన్స్...ఇలా ప్రేక్షకులు కోరుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈనెల 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లరి నరేష్ - జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం విజయం సాధించి హ్యాట్రిక్ మూవీగా నిలుస్తుంది అని టీమ్ నమ్మకంగా ఉన్నారు. మరి...సరైన సక్సెస్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ కి ఈ చిత్రం సక్సెస్ అందిస్తుందేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com