పబ్లిక్ మధ్యలో కూర్చోని సినిమా చూడటం చాలా హ్యాపీగా ఉంది - 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' చిత్ర యూనిట్!!
Send us your feedback to audioarticles@vaarta.com
హరి హర చలన చిత్ర పతాకంపై నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ , గగన్ విహారీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మించారు. ఈ చిత్రం ఈ రో జు విడుదలైంది. చిత్ర యూనిట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ మయూరి థియేటర్ లో పబ్లిక్ తో కలిసి సినిమాను తిలకించారు.
ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ..."శ్రీ మయూరి థియేటరల్ లో పబ్లిక్ తో కలిసి మా సినిమా 'ఇంతలో ఎన్నెన్ని వింతలో ' చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సీన్ ని పబ్లిక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీకి , హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ కి, గగన్ విహారీ విలనిజానికి ఆడియన్స్ క్లాప్స్ , విజిల్స్ కొడుతున్నారు. మేము సిన్సియర్ గా చేసిన ఎఫర్ట్ కి తగ్గ రెస్పాన్స్ రావడంతో చాలా ఆనందంగా ఉన్నాం.
ఆడియన్స్ తో కలిసి సినిమా చూడటం వండ్రఫుల్ ఎక్స్ పీరియన్స్ . మా సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి మంచి రెస్పసాన్స్ వస్తోంది. మా చిత్రానికి ఇంత మంచి సక్సెస్ ను అందించిన ప్రేక్షక మహాశయులకు ధన్యావాదాలు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments