ఏప్రిల్ 6న 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు.
నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న ఈ చిత్రం విడుదల సందర్బగా నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ... యాజమాన్య సంగీతం లో ఇటీవలే విడుదలైన మా ఆడియో లో సురేష్ ఉపాధ్యాయ రాసిన ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం.... అనే పాటకు యు ట్యూబ్ లో 1.5 మిలియన్ పైగా వీక్షకులను ఆకట్టుకుంది, మా చిన్న చిత్రానికి ఇంత స్పందన రావడం ఆనందంగా ఉందని తెలియపరుస్తూ, మా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని తెలియపరిచారు.
నల్లవేణు, దువ్వాసి మోహన్, నరసింహా, కృష్ణ తేజ, త్రిశూల్, గగన్ విహారి, రమేష్, భార్గవ్, కిషోర్ దాస్, సత్తన్న, దుర్గారావు, మీనా వాసుదేవ్, కౌశిక్, పద్మ జయంతి, సోనక్షీ వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత - డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరామెన్ - ఎస్ మురళీ మోహన్ రెడ్డి, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, సంగీతం - యాజమాన్య, ఆర్ట్ - జిల్ల మోహన్, స్టంట్స్ - మర్సాల్ రమణ, కొరియోగ్రఫీ - విఘ్నేశ్వర్, సాహిత్యం - సురేష్ ఉపాధ్యాయ, పి.ఆర్.ఓ. రాంబాబు కడలి,కో డైరక్టర్ - రామ్ ప్రసాద్ గొల్లపల్లి,రచనా సహకారం, శివ యుద్ధనపూడి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments