మే 26న విడుదల కాబోతున్న 'ఇంతలో ఎన్నెని వింతలో'
Send us your feedback to audioarticles@vaarta.com
టాలెంటెడ్ హీరో నందు నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇంతలో ఎన్నెని వింతలో విడుదలకి ముస్తాబవుతోంది. హరి హర చలన చిత్ర పతాకం పై తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి.వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహం తో చిత్రాన్ని కూడా మే 26న విడుదల చేసి సక్సెస్ అందుకుంటామని దర్శకనిర్మాతలు అంటున్నారు..
ఇప్పటివరకు టాలీవుడ్ లో రాని ఓ ఢిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందినట్లుగా చిత్ర బృందం తెలిపింది. నూతన దర్శకుడు అయినప్పటికి వరప్రసాద్ ఈ సినిమాని ప్రేక్షకుల్ని అలరించే రీతన తీర్చిదిద్దనట్లు యూనిట్ సభ్యలు చెబుతున్నారు. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరో నందుతో పాటు స్వామిరారా ఫేమ్ పూజారామచంద్రన్ కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనతం త్వరగా వాటిని ముగించి ఈ మండు వేసవిలోప్రేక్షకుల్ని హాయిగా అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా దర్శకుడు వరప్రసాద్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments