30 ఇయర్స్ జర్నీలో నేను సక్సెస్ అయ్యాను అంటే కారణం ఆ రెండే - విక్టరీ వెంకటేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వైవిధ్యం కోసం తపిస్తూ...కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా ప్రేక్షక హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న అగ్ర కధానాయకుడు విక్టరీ వెంకటేష్. యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన చిత్రం బాబు..బంగారం. వెంకటేష్ - నయనతార జంటగా నటించిన బాబు...బంగారం చిత్రం ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
బాబు...బంగారం కాన్సెప్ట్ ఏమిటి..?
జాలీ ఎక్కువుగా ఉన్న పోలీస్ కథ ఇది. ఇంకా చెప్పాలంటే... జాలి కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ సమస్యలో వున్న ఓ అమ్మాయి జీవితంలోని వస్తే ఎలా వుంటుంది అనేది ఎంటర్ టైనింగ్ గా చెప్పాం. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఆడియోన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
బొబ్బిలిరాజా చిత్రంలోని అయ్యో...అయ్యో అయ్యయ్యో అనే డైలాగ్ ఇందులో పెట్టారు కదా..ఆ ఆలోచన ఎవరిది..?
డైరెక్టర్ మారుతి ఆలోచనే. నా పాత సినిమాల్లో డైలాగ్ కానీ..సాంగ్ కానీ.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఏదో ఒకటి పెట్టాలి అనేది ఆలోచన. బొబ్బిలిరాజా లో ఈ డైలాగ్ అందరికీ కనెక్ట్ అవుతుందని మారుతినే ఈ డైలాగ్ ఉంటే బాగుంటుంది అని పెట్టాడు. ఈ జనరేషన్ వాళ్లకు తెలియకపోయినా చూస్తారు కదా అని ఓకే చెప్పాను.
గోపాల గోపాల తర్వాత గ్యాప్ వచ్చింది కదా..! కారణం..?
నేను ఏది ముందుగా ప్లాన్ చేయను. గ్యాప్ కూడా అలా వచ్చిందే. అంతే కానీ...కావాలని గ్యాప్ తీసుకోలేదు. నాన్నకు హెల్త్ బాగోకపోవడం, మంచి స్ర్కిప్ట్ కోసం వెయిట్ చేయడం తదితర కారణాల వలన గ్యాప్ వచ్చింది అంతే..!
ఈమధ్య సినిమాలు తగ్గించేద్దాం అనుకున్నాను అని చెప్పారు కదా ఎందుకని..?
నిజమే.. సినిమాలు తగ్గించాలి అనుకున్నాను కానీ...ప్రస్తుతం నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. డిఫరెంట్ సినిమాలు చేయాలి. యూత్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలి అంటే అలాంటి స్ర్కిప్ట్ సెట్ కావాలి. ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఏదీ ప్లాన్ చేయను. నాకు ఆ క్షణంలో అలా అనిపించింది అదే చెప్పాను.
మారుతితో రాధా అనే సినిమా చేయాలనుకున్నారు కదా...ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే ఈ ప్రాజెక్ట్ చేసారా..?
ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఏదో చేయాలి అని ఈ ప్రాజెక్ట్ చేయలేదు. మారుతి నాతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించాడు. మంచి కథతో వచ్చాడు నచ్చింది చేసాం అంతే.
నయనతార ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు కారణం..?
నయనతార ఈ సినిమా అనే కాదు ఏ సినిమాకి ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయదు. ఆ విషయం ముందే చెప్పింది.
మీరు, నయనతార కలిసి నటించిన లక్ష్మి, తులసి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అందుకనే సెంటిమెంట్ గా నయనతారను సెలెక్ట్ చేసారా..
సెంటిమెంట్ అది ఇదీ అని పెద్దగా ఏమీ ఆలోచించలేదు. మా ఇద్దరి జంట బాగుంటుంది అనిపించింది నయనతారను సెలెక్ట్ చేసాం. అంతే..ఏ విషయం గురించి ఎక్కువుగా ఆలోచించలేదు.
మారుతి అంటే భలే భలే మగాడివోయ్ వరకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సినిమాలు తీస్తాడు అనే ముద్ర ఉంది. అలాంటిది మారుతితో సినిమా అన్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించారా..?
నేనే కాదు...మా సంస్థలో ఏ డైరెక్టర్ తో అయినా సినిమా చేస్తున్నాం అంటే...ఆ డైరెక్టర్ సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించం. మనకు చెప్పిన కథ ఎలా ఉంది అనేదే ఆలోచిస్తాం. మారుతి విషయంలో కూడా అలాగే ఆలోచించాం. మారుతి చెప్పిన కథ నచ్చింది సినిమా చేసాం. సెట్స్ లో మారుతి ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా కూల్ గా ఉండేవాడు. చాలా కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ చేసాడు. మారుతి కాన్ఫిడెన్స్ కి తగ్గట్టే మంచి అవుట్ పుట్ వచ్చింది.
సీనియర్ హీరోల పక్కన నటించడానికి హీరోయిన్స్ దొరకడం లేదు కదా మీరేమంటారు..?
ఎవరో ఒకరు దొరుకుతారు అదేమి పెద్ద ప్రాబ్లమ్ కాదు. హీరోయిన్ కన్నా ముందు స్ర్కిప్ట్ కుదరాలి.
మీరు హీరోగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కదా...! 30 ఇయర్స్ జర్నీని గుర్తుచేసుకుంటే ఏమనిపిస్తుంది..?
30 సంవత్సరాలు పూర్తయ్యాయి అని గుర్తుచేస్తుంటే...అప్పుడే 30 ఇయర్స్ అయ్యిందా అనిపిస్తుంది. ఏ ప్లాన్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నన్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను. మా పేరెంట్స్ నువ్వు అది చెయ్ ఇది చెయ్ అని నా పై వాళ్ల అభిప్రాయాలను రుద్దలేదు. నాకు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకనే నాకు నచ్చిన సినిమా రంగంను ఎంచుకున్నాను.
మీ పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చినట్టే మీరు మీ పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తారా..?
ఎందుకు ఇవ్వను ఖచ్చితంగా ఇస్తాను. మా అబ్బాయి అర్జున్ 8వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ లో బాస్కెట్ బాల్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. వాడు ఏ రంగంలో ఇంట్రస్ట్ చూపిస్తే ఆ రంగంలో ఎంకరేజ్ చేస్తాను.
మీరు సక్సెస్ అవ్వడానికి కారణం హార్డ్ వర్కా..? లేక లక్కా..?
నా సక్సెస్ కి హార్డ్ వర్క్..లక్ ఈ రెండు కారణం అని నమ్ముతాను. సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి. అలాగే ఎంతో కొంత లక్ ఉండాలి.
వివేకానంద కథాంశంతో సినిమా చేయాలనుకున్నారు కదా..? ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?
నిజమే...వివేకానంద స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. కానీ...సెట్ కాలేదు. మనం చాలా అనుకుంటాం కానీ...అన్నీ జరగవు కదా..
మీరు ఎక్కువుగా అధ్యాత్మిక ఆలోచనలతో ఉంటారు కదా...మీ నుంచి అధ్యాత్మిక చిత్రం ఆశించవచ్చా..?
నాకు చేయాలని ఉంది. అయితే...నాకు అధ్యాత్మిక చిత్రం చేయాలని ఉందని చెప్పి ఎవరో డైరెక్టర్ ని పిలిచి కథ రెడీ చేయమంటే...కంగారుగా ఏదో రాసేసి తీసుకువస్తారు. అలా కాదు...నాతో అధ్యాత్మిక చిత్రం చేయాలని ఎవరైనా డైరెక్టర్ ఫీలై స్టోరీ రెడీ చేసుకుని వస్తే...అప్పుడు తప్పకుండా చేస్తా..!
నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో సినిమా చేస్తున్నారు కదా...! ఈ మూవీ టైటిల్ ఏమిటి..?
ఈ మూవీ టైటిల్ ఆడవాళ్లు మీకు జోహార్లు. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం.
పెళ్లిచూపులు సినిమా చూసారా..?
చూసాను నాకు బాగా నచ్చింది. ఫస్టాఫ్ అయితే ఎక్స్ లెంట్ గా ఉంది.
షూటింగ్ స్పాట్ లో మీ ఇన్ వాల్వెమెంట్ ఎంత వరకు ఉంటుంది..?
సీన్ బాగోలేదంటే వెంటనే చెప్పేస్తాను అంతే తప్ప ఎక్కువుగా ఇన్ వాల్వ్ కాను. ఎందుకంటే... నేను ఏక్టర్ ని డైరెక్టర్ చెప్పింది చేయడమే నా పని. అంత వరకే ఆలోచిస్తాను. అలాగే నేను రికార్డ్స్ & కలెక్షన్స్ గురించి నేను పట్టించుకోను. వాటి గురించి పట్టించుకుంటే ప్రశాంతంగా ఉండలేం.
వేరే హీరోలు రికార్డ్స్ కలెక్షన్స్ గురించి పట్టించుకుంటారు కదా..అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది..?
వేరే వాళ్ల గురించి నన్ను అడగడం కరెక్ట్ కాదు. వాళ్ల విషయాల్లో నన్ను ఇన్ వాల్వ్ చేయద్దు ప్లీజ్..!
రానా, మీరు కలిసి సినిమా చేస్తున్నారట కదా..?
ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. అంతా ఓకే అయ్యాకా ఎనౌన్స్ చేస్తాం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
సాల ఖడ్డూస్ రీమేక్ చేస్తున్నాను. అలాగే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ తో మూవీ చేస్తున్నాను. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ గురించి కథా చర్చలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com