విజయ్ కోసం ఇంటర్నేషనల్ మెజీషియన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా సినిమాకు తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నాడు విజయ్. ఈయన నటించిన తాజా చిత్రం మెర్సల్ ను తెలుగులో అదిరింది పేరుతో అనువదిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అదిరింది. ఇందులో విజయ్ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. పంచాయతి పెద్దగా.. డాక్టర్ గా.. మెజీషియన్ గా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు విజయ్. పంచాయతీ పెద్ద.. డాక్టర్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను ఇండియాలోనే పూర్తి చేసాడు దర్శకుడు అట్లీకుమార్. మెజీషియన్ పాత్రను మాత్రం యూరప్ లో చిత్రీకరించారు. ఈ పాత్ర కోసం విజయ్ చాలా హోమ్ వర్క్ చేసాడు. ఈయన కోసమే ప్రత్యేకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెజీషియన్లు మెసిడోనియాకు చెందిన గోగో రెఖియం.. బల్లేరియాకు చెందిన డానీ బెలెవ్.. కెనడాకు చెందిన రామన్ శర్మ ఈ చిత్రంల విజయ్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించారు. అంతేకాదు.. మెసిడోనియాలో షూటింగ్ చేసుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.
మూడు పాత్రలను అద్భుతంగా చేసిన విజయ్.. మెజీషియన్ పాత్ర కోసం బాగా ఎక్కువ కష్టపడ్డాడు.
ఇందులో విజయ్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించిన రేఖియం మాట్లాడుతూ.. విజయ్ చాలా కష్టపడ్డాడు. ఇలాంటి మ్యాజిక్స్ నేర్చుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ విజయ్ మాత్రం చాలా త్వరగా.. తక్కువ టైమ్ లోనే ఈ ట్రిక్స్ అన్నీ పట్టేసాడు. ఆయన చాలా తీక్షణంగా పరిశీలిస్తాడు.. త్వరగా నేర్చుకుంటాడు అని తెలిపాడు.
సినిమాలో విజయ్ చేసే మ్యాజిక్స్ అద్భుతంగా ఉంటాయంటున్నాడు దర్శకుడు అట్లీకుమార్. మెసిడోనియాలో 70-80 మంది భారతీయులు మెర్సల్ షూటింగ్ కోసం సాయపడ్డారని చెప్పారు చిత్రయూనిట్. అంతేకాదు..
మరో మెజీషియన్ రామన్ శర్మ మాట్లాడుతూ విజయ్ గానీ మెజీషియన్ అవ్వాలని కోరుకుంటే.. అతడు చాలా పెద్ద స్థాయికి ఎదుగుతాడంటున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, కాజల్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్స్ కు పైగా విడుదలవుతుంది అదిరింది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com