సునీల్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ తాజాగా జక్కన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి వీడు గోల్డ్ ఎహే అనే టైటిల్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. సునీల్ హీరోగా డైరెక్టర్ వీరు పోట్ల వీడు గోల్డ్ ఎహే అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఒక రోజు ప్యాచ్ వర్క్ మినహా టాకీ పూర్తి చేసుకుంది. పాటలను చిత్రీకరించాల్సివుంది.
ఇక ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఏమిటంటే...ఈ చిత్రంలో సునీల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఫస్ట్ టైమ్ సునీల్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. సునీల్ డబుల్ రోల్ అంటే ఎంటర్ టైన్మెంట్ ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక చిత్రాన్ని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...డబుల్ రోల్ తో ఏరేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com