జక్కన్న ‘RRR’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి చిన్నపాటి అప్డేట్ వచ్చినా ఇటు మెగాభిమానులు.. అటు ఎన్టీఆర్ అభిమానులు.. జక్కన్న వీరాభిమానులకు పండుగే మరి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగుచూసింది. ఈ సినిమాలో ఒకట్రెండు సాంగ్స్ ఉంటాయని ఓ సారి.. అబ్బే RRRలో సాంగ్స్ అస్సలే ఉండవని.. ఇప్పటి వరకూ పుకార్లు వచ్చాయి. దీంతో సినిమాలుంటాయా లేదా..? ఉంటే ఎన్ని పాటలుంటాయో..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అయితే తాజాగా సాంగ్స్‌పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో దేశభక్తిని .. చైతన్య స్ఫూర్తిని రగిల్చే పాటలు రెండు మూడు ఉంటాయట. అయితే.. చరణ్ జోడితో ఓ సాంగ్.. ఎన్టీఆర్ జోడీతో రొమాంటిక్ సాంగ్స్ వుంటాయని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. మరో ఐటెం సాంగ్ ఉంటుందట.
ఇదిలా ఉంటే.. ఈ ఏడు పాటల్లో సుద్దాల అశోక్ తేజ 3 పాటలను రాయడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కీరవాణి తనదైన బాణీలతో మంత్రముగ్ధులను చేయనున్నాడని అంటున్నారు. అటు సన్నివేశాలను.. ఇటు పాటలను బ్యాలెన్స్ చేస్తూ రాజమౌళి ఈ కథను రక్తి కట్టించడానికి భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారట. కాగా ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి చిన్నపాటి లుక్‌ను గానీ.. చిన్న పాటి లీక్ గానీ కాకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి సాంగ్స్‌కు సంబంధించి.. లుక్స్‌కు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో ఏంటో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com