ప్రభాస్-నాగీ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది..? కథ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఇటు టాలీవుడ్లో.. అటు సోషల్ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది.
ఒకటి కాదు మూడు!
అదేమిటంటే.. అదేమిటంటే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారన్నదే ఆ న్యూస్ సారాంశం. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. అంటే సినిమా ఒకటి కాదు మూడు భాషల్లో వస్తోందంటే.. రేంజ్ ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘బాహుబలి’, ‘సాహో’ తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభాస్.. మరోసారి తన రికార్డులను తానే ఈ సినిమా ద్వారా బద్ధలు కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
కథ ఇలా ఉంటుందట..!
ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొత్తం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కొనసాగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా ఆయన పాత్ర ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ ‘క్రిష్’ చిత్రంలో హృతిక్ రోషన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంటుందట. వాస్తవానికి సైన్స్ ఫిక్షన్లో సినిమా చేయాలని అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఈ కథ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నారట. దీంతో రకరకాలుగా కథ విషయమై ఇలా వార్తలు వచ్చేస్తున్నాయ్. మరి ఫైనల్‌గా ప్రభాస్-నాగ్ అశ్విన్‌లు ఎలాంటి కథతో థియేటర్లలోకి వస్తారో తెలియాంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి.. పూర్తి చేసుకుని థియేటర్లలోకి వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments